నిర్మాణం..? నాశనం..?

నిర్మాణం..? నాశనం..?
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: లక్ష్మీ మానస

చమత్కారి సాలి పురుగు
నేసింది ఒక గూడును
మృదువైన దారాలకి,
కనిపించని విషాన్ని పూసి,
చక్కటి వలలో
చిక్కిన పురుగులను భక్షించి,
కొట్టుమిట్టాడుతున్నది
తాను నేసిన వలలో.
నింగిలో ఎగిరే పక్షి,
లోకానికి అందిస్తున్నది
సుందర సందేశాన్ని..,
తమ పిల్లలకు నీడలా రక్షించే
అబ్బురపరిచే గూళ్ళతో..,
దహించని విషపు వలలు,
అమితవవ్వని గూళ్ళు కట్టే చేతులు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!