ఒక్క క్షణం

ఒక్క క్షణం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: వడలిలక్ష్మీనాథ్

పిరికితనము తోడై,
ఆలోచన శూన్యమై,
సమస్య భూతమై
తరుము వేళ,
ఆత్మహత్య వైపు
అడుగు వేసే ఓ మనిషీ
ఆలోచించు ఒక్క క్షణం.
చేజారనీకు నీలోని
ధైర్యాన్ని, మట్టుబెట్టకు
విలువైన భవిష్యత్తును.
యుక్తి తోడ యోచించి గెలువు
ఆ ఒక్క బలహీన క్షణాన్ని.
రుజువు చెయ్యాలి నీ సామర్థ్యం.
కాలము గడిచిన
కనుమరుగౌను  నీ బాధ.
కణమును దేహముగా
మార్చి, కళ్ళల్లో ఒత్తులేసుకొని
పెంచిన నీ తల్లికి ఇవ్వకు,
బహుమతిగా  కడుపు కోతను.
నీవంటే నిరూపించే
సమయము
ఆసన్నమయింది.
నూతనోత్సాహంతో
కదులు ముందుకు.
జీవించు దీర్గాయుష్షుతో.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!