స్మృతుల తీపి తాయిలాలు

స్మృతుల తీపి తాయిలాలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: చంద్రకళ.దీకొండ

గురుతుకొచ్చిన వేళ గున్నమావి
గుబురులో కోయిల పాటై…
ఘుమాయించే గులాబీల గుబాళింపై…!
తలచినంతనే పెదవులపై
విరిసే చిరునవ్వుల పూవై…
తల్లడిల్లే మనసుకు హాయి లేపనమై…
చిత్తాన్ని తడిపే చిరు
చినుకుల జల్లై…!
మధురానుభూతిలో
ఓలలాడించే డోలయై…
అపురూపంగా తీసి
చూసుకునే స్మృతుల
తీపి తాయిలం…
ఓ జ్ఞాపకం…!!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!