మధురభాషణం!

మధురభాషణం!
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఎం.వి.చంద్రశేఖరరావు

తేనెలూరే పదాలతో,
మనసుకునచ్చే పలుకులతో,
ఎదుటిగుండె కందకుండా,
ఎదలో మధువులుచిందా,
వ్యధలుత్రుంచి,సుధలు
పంచేది మధురభాషణం!
కొంతమందితో మాట్లాడితే
ఇంకొంచెంసేపు మాట్లాడితే
బాగుండు అన్పిస్తుంది,
ఇంకొంతమందితో మాట్లాడితే,
ఎప్పుడు అయిపోతుందా,
ఎప్పుడు వెళ్ళిపోతామా, అన్పిస్తుంది,
నాతో మాట్లాడటమే ఓ ఎడ్యుకేషన్ అంటాడు ఒకాయన,
మధురభాషణం వలన
జగతిలో, జరగని పనిలేదు,
ఈరోజునుంచే,ఇప్పటి
నుంచే మీ మాటలకు లాలిత్యం చేర్చండి,
మంచిమనిషిగా వెలుగొందండీ!
పదిమందికి ఆదర్శంకండీ!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!