మనోవాంఛా ఫలసిద్ధిరస్తు

మనోవాంఛా ఫలసిద్ధిరస్తు

రచన: కమల ముక్కు (కమల’శ్రీ’)

మూతలు పడే కళ్లవెంబడి
రాలుతున్నాయి అశ్రువులు ఆనందంతో!!!

ధారలుగా కారుతున్న రక్తం
ఉరకేలేస్తూ ఆనంద తాండవమే చేస్తుంది!!!

తూటాలకు గాయపడి చిద్రమైన దేహం
లోలోన మయూరమై నాట్యమాడుతోంది!!!

కదలలేని స్థితిలో నేలను కరుచుకుని ఉన్నా
మదిలో ఏదో అవ్యక్త ఆనందం!!!

కళ్లముందు నేలరాలిన ముష్కరులును చూస్తూ
ఏళ్ల నిరీక్షణ ఫలించిన
ఆనందంతో మనసు నిండిన వేళ!

కాయాన్ని వదిలిన ఆత్మ
మువ్వన్నెల జెండాకి సెల్యూట్ చేసి
మరోజన్మంటూ ఉంటే సైనికుడై
దేశానికి సేవచేసే భాగ్యం ప్రసాదించిమని
వరమడిగినట్టున్నగా గోచరించే
వీరసైనికుల మరణం
యావత్ దేవతల
మనసులను తాకిన వేళ
అశ్రు నయనాలతో ఆశీర్వదించరా
మనోవాంఛా ఫల సిద్ధిరస్తంటూ!!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!