ప్రియ నేస్తం
రచన: చెరుకు శైలజ
మన చిన్ననాటి ఆటలు
అందమైన పాటలు
మరచిపోలేని మధురమైన మూటలు
ఆ రోజులు గురించి ఎన్నని చెప్పను మాటలు
మన జీవితానికి ఆనందపు పూల తోటలు
పూలు పూసి కాయలు కాసి
పండ్లను ఇచ్చిన మన జ్ఞాపకాల జాడలు
ముందు ముందు మన జీవివితానికి అపురూపమైన బాటలు.
చిన్ననాటి మన స్నేహాన్ని పాదిలంగా దాచుకుంటు
వాటిని మధ్య మధ్య నెమరువేసుకుంటు
పరవశించి పోవడమే గత స్మృతుల వెలుగు నీడలు
జీవిత ప్రయాణంలో అనుబంధతో నిండిన
మన శాశ్వతమైన స్నేహమే
మన చిన్ననాటి స్నేహం కదా
నా ప్రియ నేస్తమా