ఇంకేం కావాలి

(అంశం: “సంధ్య వేళలో”)

 ఇంకేం కావాలి

రచన:: బండి చందు

ఒకనాటి సాయంకాలం
మెల్లిగా వాలుతున్న సందెపొద్దు
ఆకాశాన అందరాని ఆ ఫలం
అనంత లోతు లోయలోకి దుంకినది
ఏమో మళ్ళీ తిరిగి రాకుండా ఉంటుందా
రేపటి ఉదయాన్ని మోసుకురాక ఊరుకుంటుందా
దినమంతా దివ్వెలా వెలుగులు పంచి
అలా ప్రకృతి ఒడిలోకి జారిపోయాడో లేదో
ఆశల అలసటకి నా కర్ణాంతరాలకి
వీధి చివర వినిపిస్తున్న రాగాలు
చిన్నగా మొదలైన వాన చినుకులు
గత కాలపు జ్ఞాపకాలను
తట్టితట్టి లేపుతున్న గాయాలు
మది నిండా మోయలేని భావాలతో
ఒంటరిగా కదిలిన అడుగులు
గ్లాస్ లో పొగలు కక్కే నురగలు
వదలక అందుకున్న నా చేతులు
ఇంకేం కావాలి ఈ జీవితానికి…

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!