శ్రావణలక్ష్మీ

(అంశం :’సంధ్య వేళలో”)

 శ్రావణలక్ష్మీ

 రచన::వి. పద్మావతి

చంద్రోదయ వేళలో
పసుపు కుంకుమలు అద్దిన ఆకాశం
కన్నుల పండుగ చేసే సమయంలో
గడపలన్నీ పచ్చని కాంతులతో
బంగారపు ఛాయతో మెరుస్తూ
ప్రతి ఇంట లక్ష్మి సహస్రాలతో
మారుమ్రోగిన శుభవేళ లో
శ్రావణ లక్ష్మికి ఆహ్వానం పలుకుతూ
ఆసన్నమైంది తొలి సంధ్య సమయం
శ్రావణ లక్ష్మి కొలువై
జనుల నీరాజనాలను అందుకుని
చెడును పారద్రోలి
శుభాల నొసగుటకు
జగమంతటికీ శాంతిని చేకూర్చే
శ్రావణ లక్ష్మిగా ప్రతి ఇంటి ఇలవేల్పుగా వర్ధిల్లుతోంది..

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!