శాంతిమయం

శాంతిమయం

రచన :: దోసపాటి వెంకటరామచంద్రరావు

మానవజీవితం విచిత్ర సంఘటనల సంగమం
కష్టాలు కన్నీళ్లూ ఆనందాలు సంతోషాల సమ్మేళనం
కష్టం వచ్చినప్పుడు కృంగిపొవడం సహజం
ఆనందం వచ్చినప్పుడు పొంగి పోవడం సహజమే
సుఖదుఃఖాలను సమానంగా తీసుకుంటేనే జీవనం సాగించగలం
ఆధునిక నాగరికతలో జీవనచిత్రం సమస్యలమయం
ఒత్తిడి మానసికక్షోభ భయాందోళనలతో బ్రతుకుభారమవుతోంది
సంసారసాగరాన్నీ ఈదలేక సతమతమవుతున్నాం
కాస్తంత ప్రశాంతతకావాలనే ఉవ్విళ్ళూరుతాం
శాంతికోసం పరితపిస్తాం
జీవనఛక్రంలో వివిధదశలను దాటుకుని చివరకు
ఆధ్యాత్మీకం వైపు మరలాల్సిందే
అదేశాంతిమార్గం
మనసును స్ప్రహను చైతన్యాన్ని కలిగే సమస్తితిని
కోరుకోగలిగితే జీవితం ధన్యమవుతుంది
కాస్తంత సమయాన్ని మనం ఆధ్యాత్మీకం వైపు
మరలిస్తే బ్రతుకం శాంతిమయం కాగలదు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!