కనుమోడ్పు

(అంశం:”సంధ్య వేళలో”)

 కనుమోడ్పు

రచన:శాంతి కృష్ణ

ఏది న్యాయం?!
ఎక్కడ ధర్మం?!
ఎటువైపు పోతుంది లోకం?!
చివరికి ఏమిటి చేరే గమ్యం?!

ప్రస్తుత పరిస్థితులను తలుస్తూ
పరిపరి విధాల ఆలోచిస్తూ
సమయం మరచి, ఆదమరచి
మెల్లిగా జరుకున్నా నిదురలోకి…

ఎప్పడూ ప్రేమగా
బుగ్గలను నిమిరే చేతులు
హఠాత్తుగా అదే బుగ్గలను
కర్కశంగా చిదిమేస్తున్నాయి…

ఎప్పడూ ప్రేమగా
నుదిటిని స్పృశించే అధరాల స్థానంలో
ఇప్పుడు కోరలు బయటకి వచ్చి
శరీరానికి గాయాలు చేస్తున్నాయి…

ఎప్పుడూ ప్రేమను
కురిపించే కనులు
ఇప్పుడు ఒళ్లు గగుర్పొడిచేలా
అగ్ని గోళాలు అయ్యాయి…

ఎప్పడూ హాయిగా
ఆ శరణాల మధ్య సెదతీరే నేను
ఇప్పుడు అవే కబంధ హస్తాలలో
కబళించబడుతున్నాను…

ఒక్కసారిగా అమ్మా అంటూ
కళ్ళు తెరిచి, చుట్టూ చూసి
స్వప్నమని తలచి
ఊపిరి పీలుకున్నాను..!

అందుకేనేమో మరి
అమ్మ అస్తమానూ చెప్పేది
అసుర సంధ్యవేళ అలా
ఆడపిల్లకు కనుమోడ్పు తగదని…
పిచ్చి కలలు చేరి, మదిని తొలుస్తాయని…

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!