అవకాశాల వెల్లువ

అవకాశాల వెల్లువ

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

సాయంత్రం 5:00 గంటలు.  వాతావరణం చక్కగా చల్లగా ఆహ్లాదకరంగా ఉంది. సూర్యాస్తమయానికి సూర్యుడు సిద్ధమవుతున్నాడు. నులివెచ్చని సూర్య కిరణాలు మధి ని మీటగా,  అప్పటివరకు చీకటి రూముల్లో( వెలుతురు తక్కువగా ఉన్న ) మగ్గిపోయిన మనసుకు, శరీరానికి ఆనందంగా అనిపించింది.

స్కూల్ నుండి వచ్చిన నేను, నా హ్యాండ్ బ్యాగ్  పక్కన పెట్టి,  నాతోనా తీసుకొచ్చిన  మా పిల్లలు బ్యాగులు కూడా  పక్కన పెట్టించి, వాళ్లకి పాలు వేడి చేయడానికి వంటగదిలోకి వెళ్లాను.

ఒక స్టవ్ మీద పాలు వేడి చేస్తూ,  ఇంకో స్టవ్ వెలిగించి స్నాక్స్ రెడీ చేస్తున్నాను. పిల్లలు ఇద్దరూ గార్డెన్ లో  ఆడుకుంటున్నారు చాలా ఉత్సాహంగా. వాళ్లు ఆడే అరగంట ఆరుబయట ఈ ఆట,  వాళ్లు మనసుకి ఎంతో ఆనందం ఇస్తుంది. మానసిక ఉల్లాసానికి,  శారీరక ఆరోగ్యానికి తోడ్పడుతుందని నా నమ్మకం.  అందుకే స్కూల్ నుంచి రాగానే వాళ్ళని కాసేపు అలా వదిలేస్తాను.

వాళ్లకి అన్ని రెడీ చేసి పక్కన పెట్టి, నేను కాసేపు రెస్ట్ గా ఉంటుందని బెడ్ మీద అలా వాలిపోయాను. అందరికీ విధుల నుంచి ఒక అరగంట విరామం తర్వాత, నేను లేచి వాళ్ల ఇద్దరినీ  లోపలకు పిలిచాను.

వాళ్లకి స్నాక్స్ ప్లేట్లో సర్ది ఇచ్చి,  నేను టీ పెట్టుకుని తాగుతున్నాను. ఇంతలో వారి అలవాటు ప్రకారం,  వాళ్ల హోమ్ వర్క్  కూడా కంప్లీట్ చేస్తున్నారు. నేను మధ్య మధ్యలో వాళ్ల అనుమానాలు తీరుస్తూ, వర్క్ చేయించాను.

అన్ని పనులు పూర్తి అయ్యాక,  చక్కగా వారి శరీరానికి హాయిని ఇచ్చే విధంగా,  గోరువెచ్చని నీటితో స్నానం చేయించాను.

అమ్మా, ఇవాళ డాన్స్ క్లాస్ కి వెళ్ళను అంటూ ప్రజ్వల మారాం చేస్తే,  అమ్మ ఇవాళ హిందీ ట్యూషన్ కి వెళ్ళను అంటూ చెల్లెను చూసి ప్రణవ్ మొదలు పెట్టాడు.

చూడండి పిల్లలు… నేను చదువుకునే రోజుల్లో మాది పల్లెటూరి అవటం చేత,  ఇలాంటి అవకాశం నాకు చాలా తక్కువగా ఉండేది.  అందుకే ఒక్క చదువుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

కానీ మీకు అలా కాదు.  చక్కగా మనకు దగ్గర లోనే మంచి మంచి కళలకు సంబంధించిన వ్యవస్థలన్నీ, అవి కూడా  మన ఇంటికి దగ్గర లోనే ఉండటం మీ అదృష్టం.

అది ఒక ట్యూషన్ లాగా,  దినచర్య లాగానో కాకుండా ఇంట్రెస్ట్ గా తీసుకోండి. వాటి మీద మీకు తగిన శ్రద్ధ ఎక్కువగా ఉంటే,  మీకు అవి మనో బలాన్ని ఇస్తాయి.

అంతేగాని, అబ్బా ఇప్పుడు ట్యూషన్ కి వెళ్లాలా?
అబ్బా ఇప్పుడు సంగీతం క్లాస్ కి వెళ్లాలా?
అబ్బా ఇప్పుడు డాన్స్ క్లాస్!!!! అని విసుగ్గా మనసులో అనుకుంటే ఆ విసుగు మిమ్మల్ని ఏ పనీ చేయనివ్వదు అని అనునయంగా చెప్పాను.

నిజమే అమ్మ, నాకు డాన్స్ అక్క దగ్గర ఉండి మరీ డాన్స్ నేర్పిస్తోంది. అంతే కాదు, నేను బాగా డాన్స్ చేస్తున్నానని నా కంటే చిన్న పిల్లలకి,  నన్ను  డాన్స్ నేర్పమని చెప్పింది.  అంది కళ్ళు పెద్దవి చేస్తూ ప్రజ్వల.

అవును అమ్మ,  నేను కూడా హిందీ ప్రాథమిక, మధ్యమిక ఎగ్జామ్స్ రాసిన తర్వాత,  మా స్కూల్లో టీచర్ కూడా హిందీ బాగా చదువుతున్నావు అని మెచ్చుకున్నారు అన్నాడు ప్రణవ్.

అందుకే చక్కగా బుద్ధిగా అన్నీ తెలుసుకుని ఉంటే మనం నేర్చుకునే ఏ  విద్య అయినా మనకి భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది.

అది ఏ విద్యకి ఉండే విలువ దానికి ఉంది.  అందుకనే ఏ కళ ను తక్కువగా చూడకూడదు. ఒక్క చదువే కాదు,  మీకు ఉన్న శ్రద్ధను బట్టి ఏది కావాలంటే అది నేర్పిస్తాను అని వాళ్లకు చెప్పాను.

అయితే నేను సంగీతం నేర్చుకుంటాను అంది ప్రజల.
అమ్మా,  నేను ఈ సారి మా స్కూల్ లో, డ్రాయింగ్ సార్ దగ్గర డ్రాయింగ్ ….అలాగే చెస్  నేర్చుకుంటాను అన్నాడు ప్రణవ్.

సరే పిల్లలు ….నా వీలునుబట్టి,  అలాగే మీరు చదువుతున్న చదువును బట్టి,  చుట్టూ ఉన్న అవకాశాలు బట్టి ఏది మీకు శ్రేయస్కరము అనేది ఆలోచించి, మీకు నేర్పిస్తాను.  అది కూడా మీ ఇష్ట ప్రకారమే సరేనా!!!!! అన్నాను.  ఇద్దరూ ఆనందంగా కేరింతలు కొట్టారు.

నా ఉద్దేశం లో మానసిక ఉల్లాసానికి ఆటలు లేవు. ఇదివరకటి లాగా పిల్లలకి ఆడుకునే అవకాశాలు లేవు.  స్కూల్లో పరిధిలో ప్లే గ్రౌండ్ లేదు అని నిందించే బదులు,  మనకి చుట్టూ ఉన్న అవకాశాలను మనం సరిగ్గా వినియోగించుకుంటే  చాలు. ఇప్పటి పిల్లలకు ఒకఅవకాశాల వెల్లువే చేరువవుతుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!