ప్రేమంటే ఇంతే

(అంశం:”ప్రేమ ఎంత మధురం”)

ప్రేమంటే ఇంతే—-!

రచన:దోసపాటి వెంకటరామచంద్రరావు

 

శరతచంద్ర శీరిష ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు.
అది తొలిచూపుప్రేమగా ప్రారంభమై అంచెలంచెలుగా
పెరిగి ఒకరినొకరు విడచిపెట్టలేని స్థితికిచేరుకుంది.
మరి ఎవరికి చెప్పాపెట్టకుండా ఇద్దరూ ఎటో లేచివెళ్ళిపోయారు.ఇరుపెద్దలు కారాలుమీరియాలు
నూరుకున్నారు.ఒకరిని నొకరు ఎత్తిపోసుకున్నారు.
లేచివెల్లిపోయినవారు మాత్రం హాయిగా వున్నారు.
—— —– —- – –
కాలచక్రం గిర్రున తిరిగిపోయింది.శరతచంద్ర తండ్రి
గతించాడు.శీరిష వాళ్ళ తల్లిదండ్రులు కూడా చనిపోయారు.శీరీషవాళ్ళ అన్నయ్యకూడా పెళ్ళిచేసేసుకొని వేరే వెళ్ళిపోయాడు.శీరిషకు
తను ప్రేమించి పెళ్ళిన భర్తే దిక్కయ్యాడు.
ఇంట్లోవాళ్ళని ఎదిరించైతే పెళ్ళిచేసుకున్నారు గాని
శరతచంద్రకి నిలకడైన ఉద్యోగమంటూలేదు.చదివింది
డిగ్రీయే గాని స్థిరమైనదేది సంపాదించలేదు.శీరిష చదువు అర్ధాంతరంగా ఆగిపోయింది.అందుచేత
అతనికే విధంగాను ఉపయోగపడలేదు.శరతచంద్ర తండ్రి చాలా కఠినాత్ముడు .అతనికి కొడుకు తమకులపు అమ్మాయిని చేసుకోలేదని కోపం వల్ల
ఇంటికి రానివ్వలేదు కొడుకు కోడలిని.శరతచంద్ర తల్లికి మాత్రం కొడుకుమీద విపరీతమైన ప్రేమ అభిమానం.కొడుకు పై నున్న ప్రేమాభిమానాలే వారిని
ఇంటికి రప్పించాయి.కొడుకుమీద ప్రేమ మాత్రమే ఆవిడకి.కోడలు మీద మాత్రం గుర్రుగానే వుండేది.
అలాగే శరతచంద్ర అక్కా చెల్లెల్లు కూడా.ఎప్పుడు
శీరీషను సాధించడమే.వాళ్ళు పెళ్ళిల్లైనా తల్లి వద్దకు
రాకపోకలు బాగానే సాగిస్తుండేవారు.
తమ్ముడిభార్యమీద పెత్తనం బాగానే చెలాయిస్తుండేవారు.భర్త తప్ప మరో దిక్కులేని శీరీష అన్నింటిని భరించేది.అవన్నీ చూసిన శరతచంద్ర భార్యను తీసుకొని మళ్ళి ఇంటినుండి వెళ్ళిపోయాడు.
ఐదుసంవత్సారాలు గడచిపోయాయి.శరతచంద్ర శిరీషలప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు పుట్టారు.
ఒక అబ్బాయి ఒక అమ్మాయి.మనవడు మనవరాలు
కలగడంతో శరతచంద్ర తల్లి మళ్ళి కొడుకుని తన దగ్గరకు రప్పించుకుంది.అంతేకాక ఆమె ఆరోగ్యంకూడా క్షీణించింది.దాంతో మళ్ళి శరతచంద్ర శిరీషలు ఇంటికి రాకతప్పలేదు.చేస్తున్న చిన్ళ ఉద్యోగం
వదులుకోవలసివచ్చింది.వ్యాపారంమంటు ఒక చిరువ్యాపారం ఆరంభించాడు.కలసిరాలేదు.తల్లి
ఆరోగ్యం క్షీణించసాగింది.తండ్రిసంపాదించిన ఆస్తీ కేవలం ఇల్లే.అది ఉండడానికి సరిపోతుంది.మరి బ్రతుకుతెరువో?ఆలోచనలో పడ్డాడు.ఇంతలో తల్లి
చనిపోయింది.తల్లి చనిపోవడం ఒక దురదృష్టమైతే
ఆవిడచేసిన అప్పులు మరోక దురదృష్టమైయ్యాయి.
తండ్రి ఆస్తిపై తమకూ హక్కుందంటూ అక్కాచెల్లెల్లు
గొడవలు పెట్టారు.అవి చిలికి చిలికి గాలివానయ్యాయి.అప్పులు సంగతి మాకు సంబంధం
లేదన్నారు.ఆస్తులు పంచాలన్నారు.ఆస్తంటూ ఉన్నది
ఇల్లేకదా.అది అమ్మాలంటే తనకి ఉండేందుకు ఇల్లు ఉండదు.పెద్దమనుషులు కూడా సమస్యను పరిష్కరించలేకపోయారు.మరోదారిలేక ఎవరిదారిన వారు అక్కాచెల్లెల్లు వెళ్ళిపోయారు.శరతచంద్ర శిరీషలు తమ బ్రతుకుతెరువు వెతుక్కో సాగారు.
****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!