నీవు లేక నేను లేను

(అంశం:”ప్రేమ ఎంత మధురం”)

నీవు లేక నేను లేను

రచన:జయ

సింధు  ఏమి చేస్తున్నవే.
ఈ రోజు క్లాస్ లేదు అన్నావ్ గా.
మరి ఎక్కడి వెళుతున్నవే
హా అమ్మ.! మేడమ్ రమ్మని ఫోన్ చేశారు.
అందుకే వెళ్తున్న వచ్చేస్తా త్వరగానే.
సరే ఏమైనా తిని వెళ్ళు,
అబ్బా అమ్మ ఇప్పుడు ఏమి వద్దు టైం అయ్యిపోయింది.
అవునా మరి ఉదయం నుంచి అద్దం ముందు నుంచి కదలడం లేదు. అస్సలు నువ్వు వెళ్ళేది మేడమ్ దగ్గరకేనా.!
అవును అమ్మ నిజంగా మేడమ్ దగ్గరకే.
అని బయటకు రాబోయి మళ్ళీ అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకుంటూ అబ్బా ఎంత ముద్దు వస్తున్నవే.!
కన్నా ఇలా చూస్తే అస్సలు వదలడు.
అమ్మో టైం అయ్యిపోతుంది వాడు వచ్చేసరికి అక్కడ కనిపించకపోతే చంపేస్తాడు.
అమ్మ వెళ్ళొస్తా.! అని చెప్పేసి  వెళుతుంది.
కన్నా ఎక్కడికె గా వస్తాను అన్నాడు,మరి కనిపించడం లేదు అదే నేను లేట్ గా వస్తే అరుస్తాడు.
అని వెతుకుతూ ఉండగా వెనుక నుంచి గట్టిగా హత్తుకొని,ఎంటే ఇంత అందంగా ఉన్నావ్ ఎంటే . ఇలా ఉంటే కష్టం పిల్ల ముద్దువస్తున్నవే.
ఒక ముద్దు ఇవ్వవే ప్లీస్ నే.
ఓయ్ పిల్లొడా ఒళ్ళు ఎలా ఉంది.
పిచ్చిగా ఉందే.
ఆహా.! అయితే పదా ఎర్రగెడ్డకి.
ఎర్రగెడ్డకి ఎందుకే ,నీ ఎర్రని పెదవులు అందివ్వు నా పిచ్చి తగ్గుతుంది.
ఓయ్ వేషాలు వెయ్యకు కన్నా.
అది కాదే ఒక సారి ఆలోచించు పిల్ల.
హా సరే కన్నా,రేపు ఇదే టైం కి ఇక్కడికి రా ఇస్తా,రేపు నీ  పుట్టినరోజు కదా.
హే అవునా.!
హ్మ్మ్ నిజమెరా ఇస్తా.
చాలే ఈ గిఫ్ట్.
ఇంకేంటి.
ఏముంది అలా నడుస్తుంది.
అవును నీకు మ్యూజిక్ కాంపిటీషన్ ఉంది అన్నావ్ ఎప్పుడు ఎల్లుండి.
సరే బై అమ్మ నన్ను త్వరగా వచ్చేయమంది.లేట్ అయితే అనుమానం వస్తుంది.
హ్మ్మ్ ఉంటాను.
ఇంటికి వేళ్లి కాల్ చేస్తా.
ఇంత సేపు అయ్యింది కాల్ లేదు ఏంటి అని ఆలోచిస్తూ ఉండగా హై అని వస్తుంది.
సింధు అని పేరు వినగానే.
హ అమ్మ వస్తున్న.
కన్నా అమ్మ పిలుస్తుంది మళ్ళీ కాల్ చేస్తా.
వీలు ఉంటే నైట్ కి చేస్తా, లేకపోతే రేపు కాల్ చేస్తా.
ఒకే నా.
హ్మ్మ్ ఒకే నే.
మారుసతు రోజు అందంగా రెడీ అయ్యి. కన్నా కి ఇస్తానన్న గోఫ్ట్ కోసం ఆలోచిస్తూ.
ముసి ముసి నవ్వులు నవ్వకుంటూ.
వెళ్ళింది. తన కోసం ఎదురుచోస్తూ.
ఏంటి ఇంకా రాలేదు. టైం అయ్యింది. ఏమైందో అని కాల్ చేస్తే కలవలేదు, ఆన్లైన్ లో కూడా లేడు.
చాలా సేపు చూసి ఇంటికి వెళ్ళింది. కానీ తన నుంచి కాల్లేదు,ఆన్లైన్ లో లేడు.
ఒక రోజు గడిచింది,రెండో రోజు కూడా లేదు.
ఇక కంగారు మొదలు అయ్యింది సింధు లో, ఫ్రెండ్స్ ని అడగడం మొదలు పెట్టింది.
తన గురించి ఎవరికి తెలియదు అని చెప్పారు.
రెండు రోజులు అయ్యింది,తిని,నిద్రపోయి.
ఒక గంట కూడా తను మాట్లాడకుండా వుండనిది. రెండు రోజులు అయ్యింది తన జాడ తెలిసి.
సింధు ఏమైంది నీకు రెండు రోజులు నుంచి చూస్తున్న,నీరసంగా ఉన్నావ్.
ఏమి సరిగా తినడం లేదు. సరిగా నిద్రపోయినట్లు లేవు.
అబ్బా ఏమి లేదు అమ్మ.నన్ను తినకు.
అని విసిరుగా బయటకి వెళ్ళి. ఇక దుఃఖం ఆగడం లేదు.
ఇలా నాలుగు రోజులు అయ్యింది.
తన దగ్గర నుంచి కాల్ రావడం చూసి.
కన్నా నువ్వు 5 నిముషాల్లో నా దగ్గర ఉండాలి. అర్ధం అయ్యిందా.
దీనికి బా కలినట్టు ఉంది. అయ్యింది నా పని.
అనుకుంటూ వెళ్ళాడు.తనని చూడగానే పరిగేట్టుకొని వెళ్లి గట్టిగా హత్తుకొని ఏడవడం మొదలు పెట్టింది.ఏమైంది పిల్ల ఎందుకు ఏడుస్తున్నావ్.
పోరా.. పో నిన్ను అస్సలు చంపేయాలి.
నాలుగు రోజులు అయ్యింది తెలుసా నీకు.
నా గురించి ఆలోచించవా అసలు.
నేను నిన్ను చూడకుండా మాట్లాడకుండా ఒక గంట కూడ ఉండలేను అని తెలిసి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయావు.
ఫోన్ కూడా లేదు.
అని కొట్టడం మొదలు పెట్టింది.
ఒక సారి ఆగు పిల్ల.
నానమ్మ పోయింది. ఆ హడావిడిలో ఫోన్ ఇంట్లో
మర్చిపోయా.
సొర్ర్య్ నే
ఇంకెప్పుడూ ఇలా చెయ్యను .
నాకు అర్ధం అయ్యింది రా నువ్వు లేక నేను లేను అని.
******

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!