మా’చందు’ మామ

మా’చందు’ మామ
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక

రచన: ఆకుమళ్ల కృష్ణదాస్

ఆయనకేం హాయిగా వున్నాడు మా చందు మామ
ఆకలైతే మేఘాలను కొరుక్కు తింటూ
విరి సుమాల మకరందం గ్రోలుతూ
కలువలతో కిలకిల లాడుతూ
చల్లని కిరణాలతో పెదవులు తుడుచు కుంటూ..
ఆయనకేం హాయిగా వున్నాడు
ఇవి చూడలేని తళుకు తారలన్నీ
జలతారు పరదాలో దాక్కున్నాయి అలక మేఘమెక్కి
ఆయన ఆటపాటలతో అలసిపోయాడనుకో
అర్ధనారీశునికి అలంకారమై కూర్చుంటాడు
అక్కడే ఆదిశేషునితో ఆడుకుంటాడు
అదిరించి బెదిరించావనుకో
అమావాస్య చాటుకెళ్లి అదృశ్య మౌతుంటాడు
ఆయనకేం ఆహ్లాదంగా ఉంటాడు..
ఆనందంగా ఉంటాడు
ఎందుకంటే ఆయన నెలరాజు కదా!
వెన్నెల రాజు కదా!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!