మామ సరసం

మామ సరసం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: యాంబాకం

సైకిల్ తేవోయ్ మామో, మామ
సరదాగా పోదాము మామో మామ
మలుపు గిలుపు తిరగాలి
మనిషోస్తే ఒరగాలి
సైకిల్ తేలేను పిల్లోపిల్లా
సరదాగా రాలేను పిల్లో పిల్లా

కారు తేవోయ్ మామో మామ
కాకినాడ పోదాము మామో మామ
పెద్ద బస్సు ఎదురొస్తాయ్
ఎద్దు బళ్ళు అడ్డొస్తాయ్
కారునే తేలేను పిల్లో పిల్లా
కాకినాడ రాలేను పిల్లో పిల్లా

రైలు బండి తేవోయ్ మామో మామ
రామేశ్వరం పోదాము మామో మామ
అడుగడుక్కి వంతెనలు
నడుమ నడుమ సొరంగాలు
రైలు బండి తేలెను పిల్లో పిల్లా
రామేశ్వరం రాలేను పిల్లో పిల్లా

స్టీమరేనా తేవోయ్ మామో మామ
సీమకెళ్లి రావాలి మామో మామ
ఏ తుఫాను వస్తుందో
ఏ కెరటం లేస్తుందో
స్టీమరేనా తేలేను పిల్లో పిల్లా
సీమకైన రాలేను పిల్లో పిల్లా

ఏరోప్లేన్ తేవోయ్ మామో మామ
ఏగిరెగిరి పోదాము మామో మామ
హూరుగాలి కొట్టోచ్చు
కారు మబ్బు పట్టోచ్చు
ఏరోప్లేనుతేలేను పిల్లో పిల్లా
ఏగిరెగిరి రాలేను పిల్లో పిల్లా

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!