ఊహలు నిజం చేసుకో

ఊహలు నిజం చేసుకో
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: లగిశెట్టి ప్రభాకర్

ఊహల్లో విహరిస్తూ గాల్లో మేడలు కడుతూ
నన్ను నేను మరుస్తున్న తరుణంలో
వాస్తవం వెక్కిరిస్తోంది విధి  వక్రీకరిస్తుంది
ఎన్నో ఊహించుకుంటాం అన్ని  జరుగుతాయా
జరగవు… జరగవు గాక జరగవు…
కొన్ని జరగవచ్చు మరికొన్ని జరగక పోవచ్చు
మనం ఊహించనివి ఎన్నో జరుగుతుంటాయి
ఇలా అనుకున్నాను అలా అయిందేమిటి
అని అనుకునే సందర్భాలే ఎక్కువగా ఉంటాయి
అందుకే జరిగే పరిణామాలతో
సర్దుబాటు తత్వం తో ముందుకు పోవలసిందే
కొన్ని కొన్ని ఊహలు ఊహాలుగానే  కాకుండా
వాటికి తగిన ఆలోచన చేస్తూ పక్కా ప్రణాళిక తో
ఆత్మ విశ్వాసంతో కృషి చేస్తూ ముందుకు సాగితే
నీ ఊహలు నీ లక్ష్యాలు చేరే అవకాశం  ఉంటుంది
అందుకే..నీ శాయశక్తులా ప్రయత్నించు
నీ విజయానికి నీవే బాటలు వేసుకో
నీ ఊహలు నీవే నిజం చేసుకో.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!