క్రిష్ణారామా

క్రిష్ణారామా

రచన::యాంబాకం

ఒక ఊళ్ళో కోటయ్య అనే ఒకడుండేవాడు. కోటయ్య భార్య పేరు కాంతమ్మ . కాని భార్యను ఒసేకాంతం అని ముద్దుగా పిలుచుకునే వాడు కోటయ్య.ఆదంపతులకు నలుగురు కుమారులు. నలుగురికి వివాహం చేయదలచి నలుగురికి మంచి సంబంధాలు చూసి వివాహాలు జరిపించి నలుగురు కోడళ్ళును కాపరాలకు తీసుకొనివచ్చారు.
కాంతమ్మ సంసారం చక్కదిద్దటంలో చాలా సమర్ధురాలు. నలుగురు కోడళ్ళతో బాగకలిసి పోయింది. కానీ ఇంటిపనులనుకోడళ్ళకు అప్పచెప్పి తనొపక్క” క్రిష్ణా రామా”అనుకుంటూ కాంతమ్మ విశ్రాంతి తీసుకోవాలని అనుకొని,తన నలుగురు కోడళ్ళ లో ఎవరు తన స్థానానికి తగినవారు అని కాంతమ్మ ఆలోచన మొదలై తన భర్తను సలహా అడిగింది..
తన భార్యకుగల విచారాన్ని గ్రహించి కోటయ్య నలుగురుకోడళ్ళును పరీక్షించదలుచుకున్నాడు.ఆయన ఒక్కొక్క కోడలిని పిలిపించి తలా వందరూపాయలు ఇచ్చి తాను తిరిగి అడిగేదాకా వందరూపాయలు భద్రంగా దాచమని హెచ్చరించాడు.
పెద్ద కోడలు రమ ఈ విధంగా ఆలోచించింది ఇంటిలో ఎప్పుడూ డబ్బు ఉంటుంది. మామగారు వందరూపాయలు అడిగిన వెంటనే పెట్టేలో నుంచి తీసుకుపోయి ఇవ్వవచ్చు. దీనికి ఈ వందరూపాయలని భద్రపరిచేదేంటి? అనుకొని మామగారిచ్చిన ‌వందరూపాయలను ఖర్చు పెట్టుకుంది.
రెండవ కోడలు రాధ మామగారు ఇచ్చిన వందరూపాయలు రమలాగే ఆలోచించి తినుబండరాలు కు ఖర్చు చేసింది.
మూడవ కోడలు రాణి మామగారు ఇచ్చిన వందరూపాయలను తనపెట్టెలో ఉన్న చీరమడతలో దాచింది.
నాలుగో కోడలు రాగ ఈ విధంగా ఆలోచించింది మామగారు వందరూపాయలు తిరిగి ఎప్పటికి అడుగుతారో తెలియదు వందరూపాయలని భద్రం చేసేది అవసరానికి,లేదంటే ఇంటి లో దాచి తిరిగి ఆత్యవసరాలకే ఖర్చుపెట్టుటకే కదా! అందుచేత ఈ వందని భద్రం చేయడమంటే తిరిగి తరుణం వచ్చి నప్పుడు ఖర్చు చేయడం అని అనుకొని రాగ తనకు మామ ఇచ్చిన వందరూపాయలను తన సోదరునికిచ్చి వ్యాపారం లో వాటాకింద ఉంచమని యిచ్చింది.
ఇలా రాగ ఇచ్చినవందని తన సోదరుడు వ్యాపారం లో పెట్టుబడి గా ప్రతి సంవత్సరం చలామణి చేస్తూ దగ్గర దగ్గరగా ఆరు సంవత్సరాలు పూర్తి అయింది.కాంతమ్మ భర్త ను పలకరించి “ఏమండీ ఎంత కాలం అని, నాకు ఓపిక అయిపోయింది ఇక ఇంటి పనులు నావల్ల కాదు. కోడళ్ళలో ఎవరికి ఏపని అప్పగించాలో తేల్చి చేబుతానన్నారు.ఆరేళ్ళు గడిచిపోయాయి.ఇకనైనా ఏదో విధంగా నిర్ణయించండి”అన్నది కాంతమ్మ తన భర్తతో.
కోటయ్య సరేనని తాను దాచమని ఇచ్చిన వందరూపాయిని తిరిగి తీసుకురమ్మని కోడళ్ళను అడిగాడు. పెద్ధ కోడలు రమ, రెండవ కోడలు రాధ ఇద్దరు అరఇంట్లో ఉన్న పెట్టెలోనుంచి వంద, వంద రూపాయలు తెచ్చిమామగారి చేతిలో పెట్టారు.మూడవ కోడలు రాణి తన పెట్టెలో చీరమడతలో దాచిపెట్టిన పాత పడిన వందరూపాయిని తెచ్చి మామగారికిచ్చింది.
కోటయ్య వాటిని చూసి”ఇవి నిజంగానే నేను మీకు దాచమని ఇచ్చిన వందనోటేనా!”అన్నాడు పెద్ద కోడలు రమని, రెండవకోడలు రాధను పలకరిస్తూఇవి కోత్త వందనోట్లుగా ఉన్నాయి.
“ఇవి నే ఇచ్చిన వందరూపాయల నోట్లు కావు ఏం జరిగింది? నిజం !చెప్పెయ్యండి”అని కోటయ్య పెద్ద కోడళ్ళ నడిగాడు. వారు గత్యంతరం లేక చేసిన పని చెప్పి వేశారు. కోటయ్య కడపటి కోడలు రాగతో,”ఏవమ్మ నేను నిన్ను దాచమని ఇచ్చిన వందరూపాయలు ఏది?”అన్నాడు.
“ఆ వందరూపాయలను నా సోదరుడు చేయనున్న వ్యాపారం లో మన వంతుగా ఉంచమని ఇచ్చి పంపాను.నాకు కొంత గడువు ఇవ్వండి”అన్నది రాగ.సరేనన్నాడు మామ కోటయ్య. ఆపక్క రోజే తన సోదరునికి కబురు చేసింది రాగ. కబురు అందగానే రెండో రోజుకల్లా రాగ సోదరుడు పదివేల రూపాయలు తెచ్చి తన సోదరి చేతిలో పెట్టాడు. అంత మొత్తం చూసి అందరూ నివ్వెర పోయారు.ఆరెళ్ళక్రితంవందరూపాయలు సరిగా వ్యాపార లోపెడితే పదివేలు అయింది.
“చూశావా? ఇక నీ స్థానం నీ ఆఖరు కోడలు రాగ కివ్వు. ఏది ఎలా భద్రం చేయాలో ఆమెకు తెలుసు “అన్నాడు తన భార్య తో కోటయ్య.
“మిగిలిన ముగ్గురి మాట ఏమిటి? వారికి కూడ ఏదైనాపని చూపించవద్దా? అందికాంతమ్మ.
“రమ కి ఖర్చు మనిషి అమెకు చెత్త చెదారం ఊడ్చి ఇల్లు శుభ్రంగా ఉంచేపని అమె కివ్వు!
రాధ చేతికి దొరికిన తినుబండరాలు అనుభవించే గుణం.ఆమెకు వంటింట్లో పని యివ్వటం మంచిది.
రాణి జాగ్రత్తగా రక్షించగలదు.ఇంటి వస్తువులు భద్రపరచడం అమె చక్కగా నిర్వహిస్తుంది. ఈ విధంగా పనులు విభజించినట్లయితే సంసారం సుఖంగా సాగుతుందని చెప్పాడు కోటయ్య ఒసే
కాంతమ్మకు .కాంతమ్మకు ఈ ఏర్పాటు బావుందనిపించింది. ఆవిధంగానే తన కోడళ్ళకు పనులు విభజించింది.తాను అనుకొన్నట్టే ఇంటిపనుల నుంచి విరమించి,హాయిగా “క్రిష్ణారామా!”అనుకుంటూ చీకుచింత లేకుండా కాంతమ్మ మిగిలిన జీవితాన్ని సుఖంగా వెళ్ళ బుచ్చింది.

 

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!