చిన్నప్పటి జ్ఞాపకం”

“చిన్నప్పటి జ్ఞాపకం”
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన :    యాంబాకం

రాత్రి వర్షం పడుతుంది, బాగా కురుస్తుంది. చలిగాలి కూడ వీస్తుంది, “నిద్రపోతేనే మో!అమ్మ” సంగతి ఏంటి?అని నాకు ఆమెతో పడుకోవడం అలవాటు అమ్మ ప్రక్కనే పక్కవేసి పడుకోనిదే నిద్రరాదు నాకు నిద్రపట్టదు. అందుకని అమ్మ తో నిద్రవస్తుంది, అంటే పోయిపనుకో అంది “నువ్వో”అన్నాను. “ఏడున్నరకే నన్ను కూడా పడుకోమంటా! వేమిటిరా?  నీకు నిద్రవస్తే పడుకో. నేను రాలేను పని ఉంది  పొద్దున టిఫిన్ కి ఇడ్లీ పిండి కలపాలి పప్పురుబ్బాలి నేను రాలేను. అంతగా ఐతే… లేకపోతే చదువు కో” రాదు. అన్నది అమ్మ. నిద్ర ముంచుకు వస్తుంది. కాని పైకి వెళ్ళి పడుకోవడము అంటే భయం నాకు ఒంటరిగా పడుకోవడం భయం అందులో రాత్రి అవ్వ, తాత, ఎదురింటి అంకుల్ వారు, వారి చిన్నప్పటి పొలంలో జరిగిన కొన్ని తమాషా లు అనుభవాలు చెప్పుకుంటున్నారు. అవి కూడ దెయ్యం కథలు, అవి యింకా నా తలలో మెదులుతూనే వుంది. ఐనా మెల్లిగా ఒక్కొక్క మెట్లెక్కి పైకి పోయి, సన్నగా దీపము పెట్టి పడుకోన్నను. నాకు నిద్రమత్తు కాస్త తగ్గి నేరుగా చూడగానే గోడవద్ద ఎవరో నిలుచుని వున్నట్లు కనిపించింది. ఇంకా కొంచెము మెలుకువ గా సరిగ్గా చూశాను చీకట్లో కి చేతులు చాచుకొని ఎవరో గాలిలో, పాదాలు భూమికి అంటనీయ కుండా నుంచోని వున్నారు. నా కేసి పదే, పదే, చూచి నవ్వుతూ నా మంచం దగ్గరకు వస్తూ, చూస్తూ, ఉన్నట్లు కనిపించింది. పాదాలు లేవు హస్తాలు లేని మనిషి…. కాదు దె.. దె.. దెయ్యం: నా కేసి చూస్తూ నవ్వుతూ, చేతులు చాచి నన్ను రమ్మంటుంది. అమ్మా “.. అని కేక వేదామనుకొన్నాను.  నోరెండి పోయింది….. వణుకుతున్నాను. గాలి వీచింది దానితో ఏదో కదలిక శబ్దం దెయ్యం చేతులు మరింత దగ్గరగా చాచి నన్ను మంచం మీద నుంచి ఎత్తుగా పోయింది. భయంతో చమటలు పడ్డాయి, చిన్నగా దాని చేతులకు అందకుండా మంచం మీద జరిగి, జరిగి “ధభేలు”మని మంచం మీద నుంచి పడ్డాను… ఏరా సుబ్బి గా? “అని  అడిగినాడు ఎవరు?  మా తాత “ఎప్పుడు వచ్చాడు. అనుకున్నాను. తాత నున్న ఎత్తి మంచం మీద పడుకో బెట్టి “ఏమిటి”అని అదుర్ధాగా అడిగాడు. ” దె.. దె.. దెయ్యం అని మాత్రం చెప్పగలిగేను. “ఏది? ” అని నవ్వుతూ దీపం మేశాడు తాత, దెయ్యమున్న గోడకేసి చూచాను. తాత దోవతి, కోటు, తలపాగా తగిలించి వున్నాయి.
తాత రాతి 9గంటల కు నేను ఒక్కడనే ఉన్నానని వచ్చాడట. ఆ సంగతి నాకు తెలియదు. వచ్చి నే పడుకొన్న గదిలో నాకు ఎదురుగా ఉన్న కంమ్మికి తాత బట్టలు చీల కు తగిలించి. గదిలో గాలి వస్తుందని, అమ్మకు బదులు మంచం మీద నాకు తోడు పడుకొన్నాడు. కాబట్టి అమ్మ క్రింద గదిలో నిద్రపోయింది.  ఇదంతా నాకు తెలియదు. నేను  అమ్మలేని సమయం చూచి దెయ్యం నన్న తీసుకెళ్ళడానికి వచ్చిందని భ్రమపడి భయపడ్డాను.
నేను మాట్లాడ కుండా ఆ బట్టలకేసి చూస్తూండము చూచి తాత ఇదేనా దెయ్యం అని తమాషా గా నవ్వాడు…తాత తో పాటు నేను కూడ నవ్వాను.. తరువాత తాత మీద కాళ్ళు వేసుకొని నిద్రపోయాను..!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!