మన భారతీయం

మన భారతీయం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: శ్రీదేవి విన్నకోట

రవీంద్రనాథుని మనోమందిరాన
వికసించిన పూలవనంలో
అదర మధుర మహిమాన్విత గీతం
“జనగణమణ” మన జాతి ప్రభాతం
బానిస బ్రతుకులు భరియించి
జనగీతిలో జాగృతి రగిలించి
సాగర అలలకు ఎదురీదే
జన ప్రవాహ స్పూర్తిని సృష్టించి
విశ్వ చరిత్రే నివ్వెరపోయే
విశిష్ట ఉద్యమ శంఖువు పూరించి,
సకల జనుల కదలికలకు సాక్ష్యం
మన వందేమాతరమన్న నినాదం.
పవిత్ర వ్యాసాంగానికి ప్రతీక
అఖండ భారత విజయ పతాక
విశిష్ట మతముల ఐక్యత, సూచిక,
సువర్ణ శోభిత త్రివర్ణ పతాక
ఘనకీర్తిని అధిరోహించి
యుగయుగాల ధర్మపు సంరక్షణకై,
సాక్ష్యపు శిల్పంగా నెలకొల్పిన
జగన్నాథ రథ చక్రం “అశోక ధర్మ చక్రం”
న్యాయదేవతకు నిజరూపంగా
ధర్మదేవతకు ప్రతిరూపంగా
పుణ్యభూమిలో పురివిప్పిన
ప్రతి చరిత్ర కథకూ ప్రథమార్థంగా
ప్రవచించిన విలువల కార్ఖానా
“సత్యమేవజయతే”శ్లోకం.
సదా ఇదే మన భారతీయ తత్వం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!