వాన పక్రియ

వాన పక్రియ

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: యాంబాకం

ఆకాశంలో కనిపించే నల్లని మబ్బులు
ఒక్క సారి ఏకమై మబ్బు ల హృదయాలను కరిగించి
కోపమో తాపమో మోహమో తెలియనిదై
జల జల డమ డమ అనే ఘీంకార పరుగులతో చిన్న చిన్న చినుకుగా మారి
జడివాన గా కొండలను కోనలను తడుపుతూ పుడమి తల్లి ఒడిచేరి
చిన్న చిన్న తప్పటడుగులు వేస్తూ
బోల్ల పడి నేల పై దోగాడే పాపాయి లా జారుతూ
బులి బులి అడుగులు వేసే
ముద్దు చిన్నారిలా అడుగులు వేస్తూ
పట్టు కొంటే పారిపోవే చిన్ని
కిష్టయ్య లా నవ్విస్తు కవ్విస్తు
దొరికినట్లే దొరికి జారి పోవే
వెన్నదొంగలా పారిపోతూ
కన్నుమూసి తెరిచేలోగ యేరువై సెలయేరులా!
గంటలు కట్టిన దూడలా చట్టా పట్టాలు వెసుకొని వయ సొచ్చిన పల్లె పడూచులా
ఊరురా పొలం గట్టులు తాకు తూ ఊరంతా చుట్టాలని వరసలు పెట్టి పలకరిస్తూ
చూస్తూనే పెళ్ళి కూతురై అందరి మన్ననలు పొంది నదమ్మ వై చీరసారెలు తీసుకొంటూ
దీవేనలు అందుకొంటూ
చూస్తూ, పలకరిస్తూ, వస్తినమ్మ పోతుంటినమ్మ
అని కన్నీరు పెడుతూ, పెద్ద ముత్తైదువువై
పెనిమిటి జాడ ఎరిగి ప్రేమ సిగ్గు బిడియం తో శిరసు వంచి వధువు గా మారి
సముద్రుడి ని చేరే పక్రియే కదా “వాన” పక్రియ

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!