జీవితం

జీవితం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: అమ్ములు

ప్రతి మనిషి పుట్టుక నుండి మరణం  దాకా సాగే ప్రయాణమే జీవితం. చూడగలిగితే  ప్రతీ  జీవితం ఓ అద్భుతమే   చదవ గలిగితే   ప్రతీ జీవితం ఓ చరిత్రే, వినగలిగితే ప్రతీ జీవితం ఓ సుస్వరాల సంగీతమే , ఆలోచిస్తే ప్రతీ జీవితం ఒక ఆదర్శ ప్రాయమే. కష్ట సుఖాలు, ఒడిదుడుకులు, సుఖదుఃఖాలు, జయాపజయాలు, ఆనందోత్సవాలు బంధాలు, భాందవ్యాలు , భావోద్వేగాలు, క్రోధావేశాలు, ప్రేమ, ఆప్యాయత , ఆత్మీయత, ఒక్కటేంటి ఎన్నో భావాల సమాహారం జీవితం .
జీవితం అమూల్యమైనది. ఎంత కాలం జీవించాం అన్నది విశ్లేషించకుండా, ఎంత మందికి స్ఫూర్తిగా నిలిచాం అన్నది స్వీయ  విశ్లేషణ చేసుకోవాలి.
ఎంత సంపాదించాము అని బేరీజువేసుకోకుండా, మీ సంపాదనతో ఎంత మంది జీవించాలనే ఆశని చిగురింపచేసాము అన్నది లక్ష్యం గా ఎంచుకోవాలి.
కాల చక్రంతో పోటీ పడుతున్న జీవిత గమనం లో అంతకంతకుమారుతున్న వైవిధ్య భరిత జీవన విధానం లో మన జీవితానికి సార్థకం చేకూరితే, అదే చిరస్మరణీయ జీవితం అవుతుంది. అలాగే జీవిత సత్యాలను ఏ బెరుకు లేకుండా ఆస్వాదించగలిగితే , ఈ జీవన గమనం ఉషోదయ కిరణాల తేజస్సు నిండిన ఆకాశంలా, నిష్కల్మషపు పసిపాపల  బోసినవ్వుల లాగా, ఈ ప్రపంచమే శాంతిమయం అవుతుంది
“సర్వేజనా సుఖినో భవంతు”

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!