గోగుపువ్వు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: శ్రీసుధ కొలచన
కొమ్మాకొమ్మకు గుమ్మాడి
మొగ్గలు వేసాయి గుమ్మాడి
మొగ్గలు విచ్చీ గుమ్మాడి
పువ్వులుగ పూసాయి గుమ్మాడి
గోగూ పూలవి గుమ్మాడి
కిలకిలా నవ్వాయి గుమ్మాడి
చిట్టీ పిట్టొకటి గుమ్మాడి
కొమ్మపై వాలింది గుమ్మాడి
తేనెలే తాగింది గుమ్మాడి
తుర్రున ఎగిరింది గుమ్మాడి
గోగూ కర్రమో గుమ్మాడి
దివిటీగ మారింది గుమ్మాడి!