ఉత్తరం

ఉత్తరం

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: యాంబాకం

ప్రియమైన భార్య చంద్రంకు నీ భర్త చంద్రశేఖర్ ప్రేమతో వ్రాయు ఉత్తరం ఎమనగా నీవు క్షేమముగా ఉన్నావని, తలుచుతాను. ఇచ్చట నేను క్షేమముగా ఉన్నాను.ముఖ్యం గా ఈఉత్తరం వ్రాయుటకు కారణం మనం చిన్నప్పుడు చదువుకొనే రోజుల్లో ఎవరి నైన పలకరించాలంటే కార్డు, ఇంగ్లాండ్ లెటర్,కవరు,వ్రాసుకొనేవారం,కానీ గత కొంత కాలంగా ఉత్తరాలకు విలులేకుండా పోయింది.కొత్త,కొత్త,ఫోన్లు,వచ్చేశాయి అందులో ఉత్తరం కన్న వేగంగా మనుషుల తో మాట్లాడుతూ మెసేజ్ చేయడం చాలా టైమ్ సేవ్ కావడం వలన ఉత్తరాలకు విలువ తగ్గి పోయిందొయ్!

అందుకే ఈరోజు నీకు ఎలాగైనా ఉత్తరం వ్రాయాలని పించింది.తీరికగా “ఈ ఉత్తరం ప్రేమతోమొదలుపెట్టాను”.చిన్నతనం నుంచి రోజు అందరికీ ఉత్తరం వ్రాయడం నాకు అలవాటు. అమ్మనానకు,అక్కబావకు,అత్తమామకు, స్నేహితులకు ఇలా పరిచయం ఉన్నవారికి వ్రాసేవాన్ని వారినుండి ఉత్తరం వస్తుందని ఎదరు,చూసేవాన్ని, ఇంకా ఉండ పట్టలేక మా వీధి కి వచ్చే పోస్ట్ మ్యాన్ కనబడితే చాలు అడిగి ఉత్తరం తీసుకొనే వాన్ని మన అవ్వ పోస్ట్ మ్యాన్ దగ్గరనే ఉత్తరం చదివించు కొనేది. అంత ఆత్మీయత ఉత్తరం పై మన కున్న అభిమానం.

అప్పటి ఉత్తరాలలో ఆనందం, దీవెనలు, క్షేమములు, బాధలు, కోరికలు, శుభకార్యాలు, ఏడుపులు, నవ్వులు, ప్రేమలు, చూడలేని వారిని ఆ ఉత్తరంలో కనిపించి చెప్పినట్లు గా ఉండేది ఆ ఉత్తరాలు,ఉత్తరం లో స్వచ్ఛమైన ప్రేమ ఆత్మీయతలు అనురాగాలు, విన్నపాలు, ఆజ్ఞలు, అధికారాలు, రకరకాల జీవితాలు అందులో కనపడేవి,

కొత్త అల్లుడి ని పండుగ కు రమ్మని వ్రాసే ఉత్తరం,కూతురిని కానుపు కు తీసుకొని పోతాము అని వ్రాసే ఉత్తరం తాతకు మనవడు పుట్టాడనే తెలిపే ఉత్తరం,కొడుకు ఉద్యోగం వచ్చిందని వ్రాసే ఉత్తరం, మన ఊరు లో జాతర కు తప్పకుండా రమ్మని చుట్టాల నుండి వచ్చే ఉత్తరం ,అలిగి ఇంటి నుంచి వెళ్లిన మన మిలిటరీ అన్న వ్రాసిన ఉత్తరం, మన ప్రాణం లో ప్రాణం అయిన వారు లేరన్న ఉత్తరం, ఇలా ప్రతి వార్తలు మన నిత్యం జీవితం లో మనకు నేస్తంగా, చుట్టంగా,మిత్రుడుగా అని పించేది మనం ఒకరి ఒకరు వ్రాసుకొనే ఉత్తరాలు,

మన పెళ్లికి ముందు 1990లో చాలా ఉత్తరాలు వ్రాసుకొన్నాము గా అవి ఇప్పటికీ నా పర్సనల్ బ్యాగ్ లో ఉంచాను,మన పెళ్లి అయిన తరువాత మన మధ్య ఉత్తరాలు వ్రాసుకొనే అవకాశం రాలేదు అందుకే ఇలా ఉత్తరం వ్రాస్తున్నాను. ఇద్దరికీ జాబ్ ఉండటం వలన ఇంత కాలం ఎలాగో దూరం కాకుండా కలసి ఒకే చోట జాబ్ చేస్తున్నప్పుడు. నాకు అర్ధం కాలేదు ఇప్పుడే నా పనులు నేను చేసుకొంటుంటే నీ విలువ తెలుస్తుంది. చంద్రం నాకు ఏమి కావాలో టైమ్ టు టైమ్ అందించేదానవు. నాకైతే వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసి నీ దగ్గర కు వచ్చేయాలని ఉంది చంద్రం. ఇక మూడు సంవత్సరాల లో రిటైర్ అయ్యే పోతాను. ఇప్పుడు కంపల్సరీ దూరంగా రావలసి వచ్చినందుకు చాలా బాధగా ఉంది. డియర్ ఒంటరి గా ఉండాలంటే చాల కష్టం అని ఇప్పుడే అర్ద అయింది.అప్పట్లో నీపై చిన్న చిన్న అలుగులు ఇప్పుడు తలచుకొంటే నవ్వు వస్తుంది.

“ఆరోజులో నీవు కుంకుడి కాయల రసం తో నీ చేతుల తో తల అంటి తలస్నానం చెపిస్తుంటే కంట్లో పడి మంట అని అరిస్తే కంటిని పెట్టు కొని చూస్తూ నోటితో “ఉప్” అని ఊదే దానివి అప్పుడు నేను నీ కంటికి చిన్నపాప లా కనపడేవాడిని, అవి ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి చంద్రం. “డియర్ ఐ లవ్ యూ.”

నీకు ఆరోగ్యం బాగులేదు నాకు ఆరోగ్యం బాగులేదు. అందుకే ఇక మనం ఎప్పుడూ కలసే ఉండాలి, ఈమధ్య ఫోన్ చేస్తే మీ అమ్మనాన్న తమ్ముడు వారి ఫ్యామిలీ వచ్చి వారం రోజులు ఉండి పోయారని చెప్పావు,కనీసం నీవన్న వారం రోజులు అందరితో సరదాగా గడిపినావు చాలసంతోషం నాకు ఇక్కడ సాయంత్రం చాల బోర్ గా ఉంది అందుకే కావాలనే ఆఫీసులో పని ఎక్కువ నా నెత్తిన వేసుకొంటున్నా. నీవు ఆఫీసుకు ఎలా వెలుతున్నావు, మన ఇంటికి మీ ఆఫీసు చాలా దూరం కదా! అందుకే నేను మారు తున్నకాలం తో నీవు మారాలి చంద్రం అనేవాన్ని బైక్ నేర్చుకో అని ఎన్నిసార్లు చెప్పేను. ఈ వయసులో నా మొహనికి బైక్ కా అని కొట్టిపడేసావు.

ఇప్పుడు బైక్ నేర్చుకొని ఉంటే నీకు ఉపయోగపడి ఉండేది. వేళకు భోజనం చేయడం,మెడిసన్,టైంమ్ కి వేసుకో ఈ సారి నేను వచ్చినప్పుడు ఇద్దరం చెకప్ కు పోదాము. పిల్లలు తో రోజు ఫోన్ చేసి మాట్లాడు తున్నాను. వాళ్ళు హాపీ గా ఉన్నారంట పోయిన వారం వాళ్ళు మామయ్య ఇంటికి కూడా పోయి తిరిగి కాలేజ్ కి వచ్చేసారంట. వాళ్ళ హాపీ గా ఉన్నారు. మనకు 56సం//తరువాత ఇప్పుడు జాబ్ పరంగా దూరంగా రావడం కాస్త నలతగా ఉంది. నీ చేతి కాఫీ తాగి చాల రోజులైంది. కాఫీ ఒక్కటే కాదు వంట కూడ, మాఆఫీసు లో పుడ్ గురించి టాపిక్ వస్తే నీ వంటల గురించే చెపుతూ ఉంటాను.ముద్దపప్పు ఆవకాయ ముఖ్యంగా పాయసం,మా చంద్రం సూపర్ గా చేస్తుందని చెప్పాను. ఆరోగ్యం జాగ్రత్తగా చూసు కోవాలి ఇంకా పిల్లల బాధ్యత లు చేయవలసి కార్యక్రమాలు ముందు ముందు ఉన్నాయికదా! అవసరమైతే ఫోన్ చేయి సెలవు పెట్టి వస్తాను. డబ్బు కి పేద గొప్ప ఉంటుంది గాని,అనారోగ్యనికి పేద గొప్ప ఎముంటుంది. చంద్రం.పిల్లల కోసం అన్నా మనం ఆరోగ్యం కాపాడు కోవాలి అక్కడ అందరిని అడిగినట్లు చెప్పు,నేను రావడానికి ప్రస్తుతం కుదరదు. మరి అవసరమైతే తప్ప మధ్య లో రాలేను. అన్నట్టు మరచాను రేపు కంటి హాస్పిటల్ కు పోతున్నా వచ్చాక డాక్టర్ ఏమి చెప్పాడు అన్నది. ఫోన్ చేస్తాను. ఒకే బాయ్ సీ యు!టా,టా,

ఇట్లు
నీ శ్రీవారు.
*********

You May Also Like

One thought on “ఉత్తరం

  1. బాగుంది మీ ఉత్తరం. నిజంగా నే ఇప్పుడు అన్ని చిన్న సందేశాలు అయి పోయాయి. మనసులో భావాలు పంచుకోవడం పోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!