నీ కనుచూపులు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: పసుమర్తి నాగేశ్వరరావు
చిరునవ్వుల వరమేనా
నీ కనుచూపులు నా పైనే లోలోనా
నీ నవ్వుల చెంపల కెంపుల సొట్టలు
నాలో వేయిస్తున్నాయి ప్రేమ లొట్టలు
అందినట్టే ఉంటావు కానీ అందవు
చేరినట్టే ఉంటావు కానీ దరి చేరవు
కలిసినట్టే ఉంటావు కానీ కలవవు
చేరువలో వుంటూ దూరంగా వుంటున్నావు
ఇది ఎలా సాధ్యం
చేరువలో ఉండీ దూరం గా ఉండడం
ఇది ఎలా సాధ్యం
కావాలని తెలిసిన కవ్వింపుతో మురిపింపు
అదే అదే మీకు సాధ్యమైనది మాకు సాధ్యం కానిది
ఏది ఎలా వున్నా తప్పదు ఏదో ఒకప్పుడు
నదులన్నీ కడలి ఒడిలో చేరక
సిగ్గుల బుగ్గలు ఒకరి వశం కాక తప్పదు తప్పదు
ఏ గూటి చిలుక ఆగూటికి చేరక తప్పదు
ఏ కాలానికి ఆ కాలం రాక తప్పదు
ఎవరిది వాళ్ళకి దక్కక తప్పదు
కానీ జరగడానికి వేచి ఉండక తప్పదు