స్నేహబంధం

స్నేహబంధం

రచన :రాధా ఓడూరి

మూడు ముళ్ళ బంధం
నమ్మకంతో జీవనం
ప్రేమతో సహజీవనం
బాధ్యతతో సంసారం

ఏడడుగులు బంధం
ప్రేమానురాగాల స్నేహబంధం
కలిసి నడిచే జీవనయానం
కమ్మని కలలకు ఆహ్వానం
కడవరకూ తోడుండే అనుబంధం

కన్నీటి సమయాన ఓదార్పు
కష్టాల నందు నీకు నేనున్నానంటూ భరోసా
మనసై ఎరిగి మరిగి
నిత్య నూతనంగా సాగుతూ

వంశాకురానికి తోడూ నీడై
వారి అభివృద్ధి కి పాటుపడి
జీవిత చరమాంకంలో
భార్యాభర్తలు ఒకరికి ఒకరు తోడుగా
సమాజానికి మంచి దిశానిర్దేశకులై
నూరేళ్ళ దాంపత్యంగా విలసిల్లాలి
*

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!