ఉల్లాసం
రచన ::P. V. N. కృష్ణవేణి
ఉల్లాసంగా ఎగిరి పడుతున్న కెరటాలు
ఉత్సాహంగా తుళ్లిపడుతున్న చిరు జీవాలు
రేపటి కోసం దిగులు లేని స్వేచ్చాజీవులు
భవిష్యత్ పై ఆశ తెలియని ఆనందజీవులు
పక్షుల నాట్య వికాస భంగిమలు
కుహూకుహూ రాగాల ఆలాపనలు
రంగురంగుల ఆనంద హరివిల్లు
గడిపేను సంతోష దాయక జీవితాలు
జాలువారే చిటపట చినుకులు
వెదజల్లే జాజిపూల సువాసనలు
తుమ్మెదల ఝుంఝుం నాదాలు
మదిలో ఎన్నో వేల పులకరింతలు
మదిని మీటే ఎన్నో మధురిమలు
మన చుట్టూనే ఎన్నో రకాల పళిమరాలు
నా మనసు భాదను తగ్గిస్తున్నాయి
నా మనసు కళ్లాకపటం తెలియని మనసు స్నేహం కోరుతోంది