ప్రేమతత్వమే జగతికి మూలం

ప్రేమతత్వమే జగతికి మూలం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: అయ్యలసోమయాజుల ప్రసాద్

పరదేవతా స్వరూపులైన
జన్మనిచ్చిన తల్లిదండ్రుల అనురాగ-ఆప్యాయతలు
జీవితాన మరువలేనివి.
తాను తిన్నా తినకపోయినా ప్రేమతో పిల్లల కడుపునింపే
మాతృమూర్తి ప్రేమలోని మధురం వర్ణనాతీతం…!!

నీ ఉన్నతికై, నీ బాగుకై అహర్నిశలు శ్రమించే కఠినత్వం చూపినా
నా కన్నా నా పిల్లలు ఉన్నతస్థితిలో చూడాలని తపించే
పితృదేవుని ప్రేమ, త్యాగాన్ని మించినది ప్రపంచాన వేరొకటి లేదు..!!

వివాహమై, మెట్టినింట అడుగుపెట్టిన స్త్రీ భర్తయే తన సర్వస్వమని,
అత్త మామలను తన పిల్లలకన్నా అధికంగా ప్రేమించే
భారతీయ స్త్రీ ప్రపంచానికే ఆదర్శం…!!

ప్రేమంటే ఆకర్షణ క్షణికావేశం కాదు.
వసుదైవక కుటుంబమంతా
తమవారనే భావన గల దేశంలో జన్మించిన మనం
పాశ్చాత్య పోకడలననుసరించక
అందరూ భగవత్ స్వరూపులే అని
ప్రేమతత్వమే జగతికి మూలం అనే సనాతనధర్మాన్ని పాటించి
చక్కటి సమాజనిర్మాణానికి
తోడ్పడుదాం….!!

“లోకా సమస్తా సుఖినో భవంతు”

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!