ప్రతివ్రత

ప్రతివ్రత
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన- యాంబాకం

పోడువాడా! అనే టవున్ లో మాదవ్ అనే వాడు,వాడు మన కాస్త పొట్టి గా ఉండటం చేత అందరూ పొట్టి అని పిలిచారు, మాదవ్ భార్య రమా కాస్త అమాయకు రాలు అమ్మ నాన్న మాటలు జవదాటదు. అందుకే మాదవ్ పొట్టి గా ఉన్నా అమ్మ నాన్న ను కాదనకుండా పెళ్లి చేసుకుంది. రమా అందరమ్మలకు మల్లే నే ఉండవలసిన నంత ఎత్తు ఉంది గానీ పాత సినిమా లు హరికథలు చూడటం వినటం వల్ల కాస్త పతివ్రతల గురించి కాస్త చాదస్తం గా ఉంటుంది.మన మాధవి పొట్టి తనం రమా బుజాల వరకే వచ్చేవాడు. పాపం రమా తాను భర్తకన్న పోడుగ్గా ఉంఉటం పతివ్రత లక్షణం కాదనిపించింది.  “మా ఆయన పోడుగ్గా ఉంఉక పోవటం ఆయన తప్పు కాదు ఆయన లోపానికి నువ్వేంచేస్తావని పక్కంటి ప్రసాద్ భార్య తయారు. అంటూ ఉండేది. కానీ రమాకి మనసులో కొరతగానే ఉండేది. “మీరే అలాగంటే ఎలాగ తాయారు వదిన మొన్న రాత్రి చూపించిన పాత సినిమాల్లో పతివ్రత లు భర్త ల గురించి ఏమన్నరో చూశారు గా? భర్త ధృతరాష్ట్రుడి కి కళ్ళు లేనప్పుడు నాకు మాత్రం ఎందుకు కళ్ళుండాలని చెప్పేసి గాంధారి తన రెండు కళ్లు కూ గంతలు కట్టేసుకంది.?అంది రమా      “గాంధారి లాంటి పతివ్రత లేక సాధ్యం కాని పని ఇది అంది తాయారు. ఐనా రమా తృప్తి గా లేదు. “పతివ్రత లకి సాధ్యమేలేదని నిన్న రాత్రి వచ్చిన సినిమా చనిపోయిన భర్తని సావిత్రి బ్రతికించుకుంది? అంది రమా.అందుకు తాయారువదిన “ఆ మహా పతివ్రత లకి సాధ్యమైనట్లు మన కన్నీ సాధ్యం కావు రమా! ఐనా ఒక సంగతి చెబుతాను. విను. ఆమధ్య మన జాకీ అదే జానకీ కొడుకు ఇనపరింగులు రెండు తెచ్చి శూలానికి అమరుస్తుంటే “ఎందుకు రా! అని అడిగేను.      ఇవి పట్టుకొని నేల తగలకుండా వేళాడితే పోడుగు అవుతారు అంటీ అని చెప్పాడు.అంది తాయారు వదిన.
ఈ మాటలు చెప్పి రమా వెళ్ళి పోయింది.రమా తన భర్త పోడుగు అవటానికి ఇలాంటి ఏర్పాటు ఏదో ఒకటి చేయాలని ఇల్లంతా వెతికింది ఎక్కడా రింగులు దొరకలేదు రెండు చేంతాళ్ళు కనపడినై పడకగది లో దూలానికి ఆ రెండు తాళ్ళు కట్టింది. అవిపట్టుకుని వేళాడితే కొంత కాలనికి పొట్టి గా ఉన్న తన భర్త మాదవ్ పోడుగు రాక పోతాడా అని ఆమె అలొచన ఇంకా ఎత్తు గా ఉన్న ఆ దూలం అందు కోటానికి వీలుగా పెద్ధ కుర్చిపీట తెచ్చి దాని పైన చిన్నపీట నిలబెట్టింది. సాయంత్రం మాధవి ఇంటికి వచ్చి ఆతాళ్ళు కింద కుర్చీ పీటలూ చూసి ఎవన్ని ఉరి తీద్దామనే ఈఏర్పాటంతా అన్నాడు.కోపంగా!
కొందరిని మనుషుల ను ఉరి తీస్తారనీ ఉరి తీయటం కోసం తాళ్ళు పీటలూ వేస్తారనీ తెలియదు పాపం రమా కి, భర్త అడిగి ప్రశ్న కు మీ కోసమేనండి అంది అమాయకంగా! అంతే మాదవ్ కి ఒళ్ళు మండి”ఏమిటే నన్ను ఉరితీస్తావా!అంటూ చేతి కి కర్ర తీసుకొని చావబాధపోయాడు తన మంచి ఉద్దేశం చెప్ప బోయినది కానీ మాదవ్ అడ్డమైన తిట్లు తట్టడం మొదలు పెట్టాడు. మాదవ్ ఎందుకు తిడుతున్నారో కూడా తెలియదు రమాకి.                   రమా కు ఏమి తోచక తాయారువదిన ఇంటికి పోయింది. అక్కడ తాయారు ప్రసాద్ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. తయారు మొగుడి తో అసలు పతివ్రత లు ఇప్పుడు కూడా ఉండారంటావా! అని అడిగింది ప్రసాద్ అబ్బేఏది?. భర్త నాలుగు వీధులు తిరిగి కాళ్ళు అరిగి పోయేట్టు తిరిగి తిరిగి వస్తే కాళ్ళు లాగుతున్నాయి కొంచెం ఒత్తవే అంటే ఒత్తే పెళ్ళమే లేదు అన్నాడు.
“అదేమిటండి అలా! అంటారు.అందరి గురించి నాకు తెలియదు గానీ నేను మటుకు ఎన్నడూ అలా అనను అంది తయారు. ప్రసాద్ అందుకని అబ్బే నేను నీ మాట చెప్పలేదు.
నీవు మహా పతివ్రత వే నీ వల్లనే పాతివ్రత్యంకనపరచావు కనకనే పొట్టిగా ఉన్న నా కాళ్ళు ఒత్తి ఒత్తి పొడవు చేశావు.అన్నాడు. ఆ మాటలు విన్న రమా ఐతే ప్రసాద్ అన్నకూడ మొదట్లో పోట్టిగా ఉండే వారి! అనుకొని.
పాపం అమాయకురాలు ఐన రమా నిజంమనుకొని ఇంటికి వెళ్ళింది. మంచం మీద గురక పెట్టి నిద్రపోతున్న మాదవ్ దగ్గర కు పోయి తాను కూడా అతనికాళ్ళు ను భక్తి తో ఒత్తి అతడు కూడా పోడుగు ఐయేటట్టు చేసుకుందా మనుకుని మంచం మీద భర్త కాళ్ళ దగ్గర కూచుంది.
ప్రసాద్ తాయారు కాసేపు కబుర్లు చెప్పుకొని లోపలికి పోయి పడుకోబోయే సరి కల్లా మాదవ్ ఇంట్లో నుంచి కేకలువినపడగా ప్రసాద్ తాయారు వీధిలోకి వచ్చారు. వచ్చి చూడగా మాదవ్ రమాని తిడుతూ కొట్టడం చూసి ప్రసాద్ చొరవ తీసుకుని ఏమిటయ్య అడదాని మీద చేయిచేసుకుంటున్నావు?అని గదా యించాడు. వెంటనే మాదవ్ ఏ మన్నరూ ఇది ఆడదా నా పాలిట బ్రహ్మ రాక్షసి!నిద్రపోతుంటే నా పీకను పిసికి చంపేయ్యబోయింది అన్నాడు. ప్రసాద్ కి అంతా అయోమయంగా తోచింది ఏమిటమ్మ! ఈ గొడవ అన్నాడు. రమాఏడుస్తూ పతివ్రత ను భర్తను చంపుతానా చెప్పండి?కంఠం ఒత్తు తూ ఉంటే ఇంత రభస చేశాడు. అంది బుంగ మూతి పెట్టి.  కంఠఠం ఒత్తడమేమిటీ?అన్నాడు ప్రసాద్.
“తాయారువదిన మీకు కాళ్ళు ఒత్తి తనపాతివ్రత్యం వల్ల మీరు పొడుగు అయేటట్లు చేశారుగా నేను కూడా మా వారినిఅలా చయ్యాలని కాళ్ళ దగ్గర కూర్చున్నాను.”ప్రసాద్ అడ్డు తగిలి కాళ్ళ దగ్గర కూర్చున్నదానివి కంఠం ఒత్తడ మేమిటి?అని అడిగాడు ‌.
“కాళ్ళు ఒత్తు దామనే కూచున్నాను అన్నయ్యగారూ కానీ అప్పుడు రుద్రాక్ష మాల ఉన్న కంఠం కనపడినది. అప్పుడు నాకో అలోచన వచ్చింది. కాళ్ళు ఒత్తి తేనే నేను పతివ్రత నై పోయి వీరుపోడుగు అవుతారు. అదే రుద్రాక్ష మాల అలంకరింపబడి పవిత్రరం మైన ఆ కంఠం ఒత్తి తే నా పాతివ్రత్య ప్రభావం క్షణం లో పని చేసి మా వారిని నాకన్న పొడవు అవుతారని తోచి కంఠంన్ని ఒత్తాను అంది రమా తాపీగా ప్రసాద్ వేళాకోళం కన్న మాటలు నిజమని నమ్మి రమా అలా! చేసిందని ప్రసాద్ కు అర్థ మై అయ్యే ఎంత తెలివి తక్కువ దానివమ్మ! అని జాలిపడ్డాడు. ప్రసాద్ ఏమిటి!?అది తెలివి తక్కువదా! సాయంత్రం నన్ను ఉరి తీయటానికి సిద్ధమైంది. అనితాళ్ళు సంగతి కుర్చీ పంటల సంగతి చెప్పాడు. అప్పుడు తాయారువదిన నిజం తెలుసుకుని ఆ పని తన. సలహ పైన జరిగినందుకు విచారించింది. ఆ తరువాత రమా పాత సినిమా ల ప్రభావం వల్లనే ఇదిఅంతా వచ్చిందని ప్రసాద్ తాయారు వదిన మాదవ్, రకాల మధ్య “కొసమెరుపులు దిద్ది” రమాది మంచి ఉద్దేశం తాను ఏమీ నీకు హాని తలపెట్టలేదని నీవు శాంతించు అని నచ్చ చెప్పే సరికిప్రసాద్ కి తాయారువదికి తలప్రాణం తోకి వచ్చింది. అప్పటి నుంచి కోసమెరుపులు దిద్దుకొని పోట్టి పోడవు అన్న మాట మరచి పిల్లల ను కని సుఖంగా జీవించారు ప్రసాద్,రమా!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!