మానవత్వం ఎక్కడ

(అంశం:మానవత్వం ముసుగులో వ్యాపారం)

మానవత్వం ఎక్కడ

రచయిత :: సుజాత కోకిల

బ్రతుకు ఒక పోరాటం అని తెలిసిన
క్షణం క్షణం భయం అని తెలిసిన
అను క్షణం నరకం అని తెలిసిన
మానవత్వం అనే ముసుగులో
అవినీతి పాలన అని తెలిసిన
రాత్రఅనక పగలనక శ్రమించి కష్టపడే
శ్రామికులలో ఎక్కడుంది సంతోషం
మాటలలోనే కాని చేతలలో ఎక్కడుంది
మానవతా చైతన్యం రగిల్చే చల్లని
మానవతా సహృదయం ఎక్కడుంది
నివురు కప్పిన నిప్పు రవ్వ జ్వాలలా
ఎగిసి పడక మానదు ఎప్పుడో మసిగ
మారక తప్పదు ఈ నీతి లేని రాజ్యాలను ఎన్ని ఉన్న
ధర్మం ముందు ఎవరు విజేతలు కారు
స్వాతంత్రాలు అందరికి అంటారు కాని
స్వాతంత్రాలు ఆనుభవించేది కొందరే
తాను మరణిస్తూ వెలుగునిచ్చే ఆశల
ప్రమిదను చేసే అభ్యుదయ వాదులు ఎందరో
ధర్మం అనే పదానికి సంకెళ్ళు వేసి
అధర్మం. అనే పదానికి జీవము పోసినంత కాలం
ఈ సమాజము మారదు కాక మారదు
నిస్సహాయ స్థితిలో ఉంది ప్రపంచము
అందులో మనం ఊన్నామంటే మన పరుగు
ప్రయాణమెటో తెలియని పరిస్థితి మనది

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!