జీవన వేదం

 జీవన వేదం

రచయిత: సత్య కామఋషి ‘ రుద్ర ‘

రెప్పపాటుగా మబ్బులు కమ్మెనేమి.,
చంద్రుని వెలుగు ఆరిపోవునా.,
పున్నమి అమవాసైపోవునా.!

లిప్తపాటుగా గ్రహణం పట్టేనని.,
సూర్యుడు మసకబారిపోవునా.,
పట్టపగలే సందెవాలిపోవునా.!

కొలిమిలోన ఎర్రంగా కాలినా.,
పసిడి వన్నె తరిగిపోవునా.,
శుద్ధిచెందగా దాని విలువ పెరుగకపోవునా..!

ఉలి దెబ్బలెన్ని తిన్నాగానీ.,
శిల బాధతో కన్నీరు కార్చునా.,
శిల్పంగా అవతరించి తరించకుండునా.!

రేయి ముగిసి తూరుపు తెలవారగా.,
నింగినుండి నక్షత్రాలు నేలరాలిపోవునా.,
చీకట్లు ముసిరినంతనే తళుక్కుమనకుండునా..!

మనం నిదురించినంత మాత్రాన.,
కాలం స్థంభించి ఆగిపోవునా.,
ఏదేప్పుడు జరగాలో జరగకుండునా..!

అగాధాలు అడ్డుతగిలినా., ఆలస్యం అయినా.,
అపనిందలెన్ని ఎదురైనా, ఎవరెంత వెనక్కి లాగినా.,
విధి నీతో ఆడుకుంటూ, వింత పోకడలు పోయినా.!
కటికచీకట్లు కమ్మినా, విజయపు దారి మాసిపోవునా.!
ఆటంకాలు ఎన్ని వచ్చినా, నీ పయనం ఆగిపోవునా.!
జీవితం విలువ తెలియునే కానీ, నీ గమ్యం మారునా.!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!