ఆడజన్మే అభాగ్యమా

ఆడజన్మే అభాగ్యమా?

రచయిత:పరిమళ కళ్యాణ్

ఆడజన్మే అభాగ్యమా?
ఆడపిల్ల అని తెలిసీ పిండ దశలోనే పిండి చేస్తూ…
పుట్టగానే గొంతు నులిమేస్తూ…
ముద్దుగారే మోము నైనా చెత్తబుట్టలో పడేస్తూ…
పోనీ పెంచుకున్నా మగవాళ్ల కన్నా తక్కువగా చూస్తూ…
వయసుకు వచ్చాక వెంటాడే మగమహారాజులు
వారి ప్రేమని తిరస్కరిస్తే ఆసిడ్ దాడి చేస్తూ…
వారి ప్రేమని అంగీకరించక పోతే భయపెట్టి చంపేస్తూ…
తల్లిదండ్రులు చూసిన సంబంధమే అని
తలవంచి తాళి కట్టించుకుంటే…
వాళ్ళ అధికారాన్ని మన మీద చేలాయించే పురుష పుంగవులూ …
మన ఇష్టాఇష్టాలతో పని లేని భర్తలూ…
ఎదురు తిరిగి మాట్లాడితే హింసించే వారూ…
మనల్నో కీలు బొమ్మలాగా వాడుకునే వారూ…

ఇన్ని కష్టాలు ప్రేమని పంచే మాతృమూర్తికేనా?
నవమాసాలు మోసి బిడ్డను కనే తల్లికేనా?

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!