అసలైన ఆస్తి

అసలైన ఆస్తి

రచయిత: గుడిపూడి రాధికారాణి

ఎదుటివాడి పెదవులపై నవ్వున్నా
కళ్ళలో ఆకలి పసిగట్టగలగాలి
అడగకుండా ఆదుకోవడమే నిజమైన మానవత

పక్కనున్న పేదవాడి కడుపు నింపలేనప్పుడు
కోట్ల ఆస్తులున్నా నువ్పు పేదవాడివే
మానవత్వమే దైవత్వానికి దగ్గర దారి

సంపాదించినదానిలో కొంత పెట్టగలిగితే
కూటికి లేకున్నా కోటీశ్వరుడివే
మనసున్నవాడే పేదోడి మహారాజు

చప్పట్లు కొట్టినా పూలవర్షం కురిపించినా
తీర్చుకోలేనిది మానవసేవల రుణం
కృతజ్ఞతను వ్యక్తీకరించడం స్ఫూర్తిని నింపుతుంది

వేలదీపాలతో సంఘీభావం తెలుపకపోయినా
ఒక్క గుండెలో వెలుగు నింపితే చాలు
మరువలేని ఒక జ్ఞాపకం.. పొందిన మేలు

ఫొటోలతో ఆర్భాటం చెయ్యకుండానే
ఆపన్నులకు అభయహస్తం అందించవచ్చు
గొప్పలడప్పులు కొట్టకపోవడం హుందాతనం.

You May Also Like

One thought on “అసలైన ఆస్తి

  1. అసలైన ఆస్థేమిటో అద్భుతంగా చెప్పారు రాధికారాణి మేడమ్ గారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!