ఆమె

(అంశం:”అగమ్యగోచరం”)  

ఆమె

రచన :: జయ 

సూర్యుడు లో వెచ్చదనం ఆమె
చంద్రుడు లో చల్లదనం ఆమె
ఆకాశమంత ప్రేమ ఆమె
భూదేవి  ఓర్పు ఆమె.

ఉప్పెనల్లే ముంచుకొచ్చే కోపం ఆమె
తీరం చేరగానే శాంతించే శాంతం ఆమె.
శ్రమతో పోరాటం ఆమె.
ప్రేమ లాలిత్యం ఆమె.

సృష్టికి మూలం ఆమె.
చిగురించే ఆశల వారిది ఆమె.
సొగసుల ఊయలలో పరిమళాల వసంతం ఆమె.
కర్తవ్య దీక్షలో తొలి వేకువ ఆమె.

పంచభూతాల తత్వమే ఆమె.
నలు దిక్కులకు ధిక్సుచి ఆమె.
అయినా మానం, ప్రాణం కాపాడుకోలేక.
ఆమె గమనం అగమ్యగోచర మే గా
ఈ నాటికి.

****

You May Also Like

One thought on “ఆమె

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!