భద్రత కరువైన మహిళ

(అంశం:”అగమ్యగోచరం”)  

భద్రత కరువైన మహిళ

రచన :: బుదారపు లావణ్య

సృష్టికి మూలమైన
ప్రతి సృష్టికి ఆధారమైన మహిళకు
మనుగడ కరువైంది ఈ లోకంలో…..
తల్లిగా చెల్లిగా అక్కగా స్నేహితురాలిగా సహోద్యోగిగా సహధర్మచారిణిగా
ప్రేమపంచే అమృతమూర్తికి
రక్షణ కరువైంది ఈ దేశంలో…
అవని నుండి అంతరిక్షం దాకా అన్నింటా సమం అని సగర్వంగా చెప్పుకుంటున్న
భద్రత విషయంలో అబలగానే మిగిలిపోయింది……
పుట్టుకనుండి మరణం దాకా
అడుగడుగునా ఆంక్షలు
వరకట్న వేధింపులు
లైంగిక దాడులు
అత్యాచారాలు మాయలు మోసాల నడుమ
మగువ జీవితం ఆశ నిరాశల
చావుబతుకుల నడుమ ఊగిసలాడుతూ….
అగమ్యగోచరంగా మారిది.
********

You May Also Like

3 thoughts on “భద్రత కరువైన మహిళ

  1. నేటి సమాజంలో స్త్రీకి భద్రత కరువైన స్థితిని మీ కవితలో చక్కగా ఆవిష్కరించారు.
    అభినందనలు.

  2. కవిత బాగా రాశారు లావణ్య గారు‌ అభినందనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!