(అంశం::”ఆకాశానికి నిచ్చెన”)
బోసినవ్వు
రచయిత :: శాంతి కృష్ణ
అప్పుడే పూస్తున్న పసి మొగ్గలను చూస్తే నీ బోసినవ్వులు జ్ఞాపకాలు…
పూసే ప్రతి పువ్వులో నీ బోసినవ్వుల జ్ఞాపకాలు….
చిలిపి పనుల అల్లరిలో నీ బోసినవ్వుల జ్ఞాపకాలు…
రెక్కలొచ్చి ఎగిరిపోయినా
ఎంత ఎత్తు ఎదిగినా
ప్రయోజకులైనా
పనికిరాకుండా పోయినా,
ఆకాశానికి నిచ్చెన వేసినా
అధఃపాతాళంలో కూరుకుపోయినా,
నీకు చేయూతనిచ్చి నడిపించే
నీ తల్లితండ్రుల కళ్ళకు
ఎప్పటికీ నువ్వు
బోసినవ్వుల పాపాయివే…