(అంశం::”ఆకాశానికి నిచ్చెన”)
ఊహాలోక విహారం
రచయిత :: నాగ మయూరి
ఊహల పల్లకీలో ఊరేగుదామా
అనంత విశ్వంలో విహరిద్ధామా
ఆకాశానికి నిచ్చెన వేద్ధామా
నల్లని మబ్బులు కరిగిద్ధామా
పుడమిపై చిరుజల్లులు కురిపిద్ధామా
నక్షత్రాలకు నేస్తాలమై సంచరిద్ధామా
తారాలోకంలో ఊయలలు ఊగుదామా
అందాల చందమామని చేరుకుందామా
చకోరపక్షులమై వెన్నెలని ఆశ్వాదిద్ధామా
గువ్వపిట్టలమై గగనాన పయనిద్ధామా
మేఘాల మాటున దాగుడుమూతలాడుదామా
అందనిదానికి అర్రులుచాచుట అనర్థమందామా
ఊహాలోక విహారం ఆపేద్ధామా
తిరిగి భువిపైకి చేరుకుందామా