సేద్యగాడు
రచన:: యాంబాకం
అది పచ్చని పంట పొలం. ఇది ఆఊరి ఆసామిది. ఇక్కడ ఒక చిన్న విన్నపం. పంటపోలం ఆసామిదే కాని, అది ఎక్కడ ఉంది? హద్దులు ఏమిటి? ఎన్ని సార్లు ఎడాది లో పండుతుంది?ఇవిఏమి ఆసామి కి తెలియవు. అదేంటిపోలం గురించి ఆసామి కి ఎమి తెలియదా! (ఆశ్చర్యంగా ఉందా!) మరి పొలం గురించి వివరాలు ఆసామి కి తెలియకపోతే,ఆపోలం ఆసామిదే అని అన్నావు అనేగా మీ అనుమానం. అదే మరి ఆ పొలాన్ని చూసుకోవడానికి ఆసామి ఒక “సేద్యగాడిని “పెట్టుకున్నాడు. (ఆరోజు) అప్పటి నుండి ఆసామి పొలం వైపు రావడం మానేసాడు. అందుకే ఆసామి కి పొలం గురించి ఎమి తెలియదు అని సంభోదించా!
ఇక కథ లో కి వస్తే ఆసామి సేద్యగాన్ని పెట్టుకొనే ముందు అతనికి రోజు పొద్దన్నెఅంతసద్దీ , మధ్యాహ్నం ఒక సంగటి ముద్ద పొలం కుప్ప కూర్చి నాక ఒకటి లేక రెండు బస్తాల ధాన్యం ఇచ్చేటట్లు ఆ తరువాత వారి దయ అన్నట్టు మాట్లాడు కున్నారు. ఆరోజు నుండి మన సేద్యగాడు పొలం పనిలో మునిగి పోయాడు. తనకు సొంత పొలమే సాగు చేస్తునట్లుగా పొలం చేసుకోవడం ప్రారంభించాడు.
ఇక మన సేద్యగాడి వివరాల్లోకి వెళ్తే అదిగో పొలం దగ్గర నుండి కనిపించే చిన్న కొండ దాని క్రింద కనిపించే వాడే మన సేద్యగాడి ఊరు, నివాసం. అదిగో ఆకొండ దగ్గర కనిపించే బండి బాట, ఆబాటనేపోతే ఆవాడకు చేరుకోవచ్చు. ఆబాట లో మొదట్లో కనిపించే ఒక పెద్ద వేపచెట్టు దానికిందనే నిలువాటి శిల (రాయి) అది రాయి కాదండో ఆఊరి ఇలవేలుపు గ్రామదేవత. వారికి, వాడకి “శ్రీరామ రక్ష”. దానికి ఎడమవైపు కనిపిస్తుందే అదే దిగుడుబావి. ఇది పేరుకు బావి కాని ఆఊరు గంగమ్మ తల్లి. వారి అవసరాలను,దాహం,తీర్చేతల్లి.దానికి కాస్త ముందు కనిపించే దే ఊరు.అందులో 15,20 గుడిసెలు ఉండే చిన్న వాడ,అంతకు ముందు చాలా గుడిసలు ఉండేవట కాని వసతులు లేక కాలక్రమేణ కొందరు సర్దుబాటు అయిపొయారు. ఇదుగో ఈ 15 గుడిసలు ఎక్కడ బ్రతక లేక ఉన్న ఊరును,వాడను,వదలేక కొత్త ఊరు లో బ్రతక లేక ఇక్కడే కట్టి అన్నట్లు గా ఇక్కడే ఎదో జీవనం సాగిస్తున్నారు.
ఇక అసలు విషయం అక్కడ కి పడమరగా కనిపించే గుడెసే మన సేద్య గాడిది. తాటాకుల తళతళ లాడుతు కనిపించే గుడిసె. గూడెం కు ముందర చాల పెద్ద జాగ అజాగలో గుడెస కొంచెం ముందు తొట్టి, దాని నిండుగ నీళ్లు ,తళతళలాడుతూ చిన్న చిన్న అలలతో చిన్నసముద్ర మే! అన్నట్లు నీళ్లు తెల్లగా,శుభ్రమంగా,ఎప్పడు తొట్టె లో ఉంటాయి అంట మరి! దాని పక్కనే తడెకలతో చిన్న మరుగు (గదిలాగ) ఉంటుంది అది మన సేద్య గాడి స్నానం గది, దానికి కొంచెం పక్కన చిన్న చిన్న పూలమొక్కలు అవి ఎన్ని అని చెప్పలేము,రకరకాల పూలమొక్కలు వాటికి అనుకోని చుట్టూ కాగితాలపూల మొక్కలు అవి ఆ గుడెసకు ప్రహరి లాగ ఉంటాయి.ఇంక ఆ మధ్యలో అటు,ఇటు, జామ చెట్టు,చింతచెట్టు,వేపచెట్టు,ఇలా ఔషదాల మొక్కలు మన సేద్య గాడి ఇల్లు అందానికే అందంగా ఉంటుంది.
ఇక గుడిసె వాకిట్లో బాగ పేడవేసి అలికి మంచి పిండి ముగ్గు యర్రమట్టి చూస్తే ఆ అందానికి అమరులే దిగివచ్చి వరం ఇవ్వలసిందే (అందుకే వాకిలి శుభ్రంగా ఉంటే లక్ష్మీ దేవి వస్తుందని పెద్ద లు చెప్పేవారు) ఇది ఎవరి పని అనేగా! మన సేద్య గాడి భార్య నిద్ర లేచిన మొదలు గుడిసెను శుభ్రంగా ఉంచడమే ఆమె పని.మన సేద్య గాడికి ఇదిగో పొయిన ఏడాది మనువు అయింది. ఇద్దరి జంట చూడముచ్చట గా ఉంటుంది. సేద్య గాడు పోలంనుండి రాగానే అదిగో ఆచెట్ల కింద నులక మంచం వేసుకొని వేళ్ళికల పొనుకోని,అదిగో ఆ ఆకాశం వైపు చూస్తూ చందమామ వెలుతురు లో తన పొలం గురించితలచుకొంటూ కూనిరాగాలు తీస్తు భార్య ఇచ్చే చల్లని తాగుతు అలా ఇద్దరు సంతోషంగా సాగి పోతుంటారు.
మన సేద్య గాడి కితోడు మరో కొన్ని జీవులు ఉన్నాయండో ముఖ్యంగా కొన్ని కోళ్ళు, మంచి కొమ్మలు తిరిగిన పొట్టేలు,మన సేద్యగాడు పొద్దున్నే 3వ. జాము కంతా లేచి పొలం పనికి వెళతాడు.కాని 3వ జాము లో మెళకువ రావడం ఎలా గుడిస లో గడియార కూడ లేదు.కాని ఉంది ఎలా! అనుకుంటున్నారు. అవును మన సేద్య గాడు సాకు తున్న ముద్దుల కోడిపుంజు అదే మన సేద్య గాన్ని ప్రతి రోజూ ఉదయం 3వ జాము కాగానే కూస్తుంది ఒక్క సారిగాకోక్కరక్కో…అని అనగానే వెంటనే సేద్య గాడు లేచి పొలం వేళతాడు.ఒంటరిగా అనుకున్నారా! 3వ జాము లో తోడు లేకుండా ఎలా అనుకుంటున్నారా! మన సేద్య గాడి కి చెప్పెను గా ప్రతి రోజూ ఇంటి నుండి పొలం వరకు,పొలం నుంచి ఇంటికి ఒక నేస్తం ఉన్నాడు అదే పోట్టేలు, దాన్ని పోయిన ఊరు జాతర లో చిన్న పిల్ల గా ఉన్నప్పుడు కొన్నాడు. అప్పటి నుంచి అది సేద్య గాడి తోడుగా నేస్తం అయిపోయింది.అదంటే మన సేద్య గాడికి ప్రాణం.అదికూడ సేద్య గాడిని అంటి పెట్టుకొని తోడుగా ఉంటుంది.మరి
మన సేద్య గాడికి పొలం అంటే మమకారం అందరు ఒక్క కారు పంట వేస్తే మన సేద్య గాడు 2కార్లు పండింంచేటట్లు పని చేస్తుంటాడు. ఇలా సేద్య గాడు పొలం బాగాపండిస్తూ దిగుబడి బాగా రానిస్తూ, అటు ఆసామి ని చాలా సంతోషపరుస్తూ ఈ ఏడాది లో కొత్తగా ఆసామి దగ్గర కు వచ్చాడు . పొలం దిగుబడి బాగా వచ్చేలా పొలంసేద్యంచేయడం మొదలు పెట్టాడు. పొలం దున్నటం, కాడనుండి,నారుపోయడం,నాట్లువేయడం,కలుపుతీయడం,మందులు,ఎరువులు,చల్లడం,నీళ్ళుపట్టడం,ఇలా పగలు రాత్రి పొలంని కాసుకొని పంట విత్తు వచ్చేదాకా కష్టపడ్డాడు.ఇంకే ముంది పొలం కోతకువచ్చే రోజులు దగ్గర పడ్డాయి. ఆసామి దగ్గర కు పోయి,ఈ సారి పంట ప్రతిసారి వచ్చే మీ పొలం దిగుబడి కన్న రెండింతలు వచ్చేలా ఉంది,వచ్చే పలానా రోజు కోత ఏర్పాటు చూడాలి .బండ్లు, గోనిసంచులు, అవి ఇవి,ఏర్పాట్లు చూడమని మందల చెప్పి ఆసామి ఇంటి నుంచి బయలుదేరి సేద్య గాడు తన గుడిసకు వెళ్ళి పోయాడు.
గుడిసెకు పోయి కాళ్ళు చేతులు కడుక్కోని, భార్య తో పంట దిగుబడి బాగావచ్చిందె, ఆసామి అనుకొన్న దానికన్నా దిగుబడి వచ్చింది ఈసారి. ఆ ధ్యానం అమ్మి నీకు మంగళసూత్రం చేయిస్తా, నీకు నాకు,కొత్తబట్టలు,అని ఇలా ఒకరినోకరు కలలు కంటూ నిద్రపోయారు. కాని ఆసామి సేద్యగాడి కి ఎందుకు ఎక్కువ ఇవ్వాల అని(అలోచించాడు)ఆలోచన వచ్చింది, సేద్యగాడి ని ఇంక మీద పొలం దగ్గర కు రాని కుండా ఒకవేళ వచ్చినా మొత్తం తనకు అప్పగించకుండా ఎదో బస్తాలను మిగిలించుకోవాలని అనుకొన్నాడు. వెంటనే ఆసామి కి ఒక ఆలోచన వచ్చింది.తెల్లవారితే కుప్పవేయాలి, తెల్లారింది అందరూ ఆసామి సేద్య గాడు పొలం దగ్గర కు వచ్చారు,కుప్ప వేసారు. సేద్య గాడి మొహం లో సంతోషం ఆసామి మొహం లో తెలియని కపటం,తరువాత పక్కరోజు గాని,ఆ పక్కరోజు గాని కుప్పలుకూర్చాలి. ఇంతలో ఆసామి ఆలోచన ప్రకారం కుప్ప దగ్గర సేద్య గాడి ని రాత్రి కాపలా ఉంటే ఎక్కువ బస్తాలు ఇవ్వవలసి వస్తుందని వాడిని టౌన్ కి పంపే ఏర్పాటు చేసి,అదితేవాలి,ఇదితేవాలని, వాడిని టౌన్ కి పంపించేసాడు. ఆసామి సేద్య గాడు వచ్చేలోపు కప్ప కూర్చి బస్తాలను ఇంటికి చేర్చి చాలా తక్కువ దిగుబడి వచ్చింది అని మాయ మాటలు చెప్పి సేద్య గాడి కి అరబస్తానో ఒక బస్తానో ఎదో తరకలు ఇస్తే సరిపోతుందని పొలం లోని కుప్పను ఒకసారి బాగా చూసుకోని సంతోషంగా ఇంటకి పొయి భోజనం చేసి నిద్రపోయాడు.
కాని ఆసామి కి నిద్ర పట్టలేదు,తోందరగా పోయి సేద్య గాడు వచ్చే లోపు కుప్ప కూర్చేయాల ఆనుకొని పొలం దగ్గర కు వచ్చాడు. ఇంకేముంది మొత్తం నాశనం కుప్ప లేదు.కుప్ప ఉండాలసిన దగ్గర బూడిద కుప్ప పడి ఉంది ఒక్కసారి గా బోరు మన్నాడు. ఆసామికి ఎమి అర్దం కాలా! కుప్ప ధాన్యం మొత్తం నిప్పు అంటు కొని మొత్తం బూడిద అయిపోయింది. ఆసామి దిగాలు బడ్డాడు సేద్య గాడికి వస్తే ఎమిచెప్పాలో పాలుపోవడం లేదు దేవుడా! ఎందుకు ఇలా జరిగింది తెలియడంలేదు దేవుడా! అని వాపోయాడు.నేను చాలదిగుబడి వచ్చిందని గర్వపడ్డాను కాని విధి వక్రీంచింది. కుప్ప మొత్తం కాలి పోయింది.నా (ఆసామి) పరిస్థితి ఎంది? నేను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లు) అని కన్నీరు మున్నీరుగా బాధపడ్డాడు.
(పాఠకులకు దీన్ని మరోలా మారుస్తా)
ఆసామి కుప్పవేపించి సేద్య గాడి ని పిలిచి భయం తట్టి కుప్ప దగ్గర సేద్య గాడి ని కాపలపెట్టి, ఆసామి ఇంటికి పోయి హాయిగా నిద్ర పోయి పొద్దునే పొలం లో ఉండే కుప్ప దగ్గరకు వచ్చాడు ఆసామి,అనుకొన్న ప్రకారం కుప్పకూర్చారు అనుకోన్నట్లు బాగ దిగుబడి వచ్చింది. ఎవరి వల్ల సేద్య గాడి కష్టం.
కాబట్టి ఒక చిన్న ఉద్యోగి వల్ల యజమాని కి ఎప్పుడూ నష్టం రావడం జరగదు,అని యజమాని కి చేప్పడమే నాఈ సేద్య గాడు కథ సారాంశం.యజమానులా రా చిరు ఉద్యోగాన్ని ప్రోత్సాహిస్తాం మన యాజమానాన్ని కాపాడు కోందాం.
****