ప్రేమ ధనము

(అంశం:”ప్రేమ/సరసం)

ప్రేమ ధనము

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

సూర్య ఉదయంతో పాటు మనిషి జీవితం లో ప్రేమ ద్వేషం
అన్ని మొదలవుతాయి
జీవితంలో ప్రేమ ధనం అత్యంత ముఖ్య మైన వరము అందరికీ ఆ ప్రేమ పంచడం పొందడం కూడా రాదు ఎంతో ప్రేమగా ప్రేమించాను అంటూ రవి వర్మ తన ప్రేమను సౌమ్య కి మెసేజ్ పంపాడు
అమె ఎటువంటి స్పందన లేదు జీవితాన్ని నిజంగా ప్రేమించే వ్యక్తి అంటే ఇష్టమే కానీ అవకాశ వాదం గా ప్రేమించే వ్యక్తి అంటే భయము అదే మాట రవి వర్మ కి చెప్పడం ఇష్టం లేక మౌనంగా ఉండీ పోయింది ముందు చదువు పూర్తి కావాలి ఆ తరువాత తన జీవితానికి ఒక గుర్తింపు గమ్యం ఉండాలి అప్పుడే ప్రేమ పెళ్లి అన్ని ఒక సారి ప్రేమిస్తే తప్పక తన ప్రేమ విజయం కావాలి అందుకే సౌమ్య ప్రేమ పక్కన పెట్టింది
చదువుకునే వయస్సులో చదువు కోవాలి అన్నది అమె సంకల్పము దానికి కారణం ఇంటి పెద్దల పెంపకము
పెద్దల మాటల ప్రభావం పిల్లల పై ఉంటాయి అది మరువకండి
కాలం గడుపుతున్నారు అక్కడ చదువు పూర్తి అయ్యి ఉద్యోగానికి రవి వర్మ వేరే ఊరు వెళ్లి పోయాడు
ఆతరువాత అతని నుంచి ఎటువంటి సమాధానం లేదు
హమ్మయ్య తాత్కాలిక ప్రేమ పదాలు చదువుకునే దశలో సర్వ సహజము
సౌమ్య ఒక కాలేజి లో లెక్టరీర్ గా చేరింది
కొలీగ్ వాళ్ళ అన్నయ్య ఉన్నాడు అని ప్రపోజ్ చేసింది. కానీ సౌమ్య ఇంట్లో చెప్పాలి ఒప్పుకుంటే సరి అని చెప్పింది
ఇదేమిటి ఇంత చదువు చదివి ప్రేమించి పెళ్లి చేసుకోవాలి కానీ ఇంకా మార్పు లేదు అన్నది. నేను ఇంతే పెద్ద లకు విలువ ఇస్తాను అన్నది
కొలీగ్ తన కౌజి న్ కి చెప్పింది
అతను కూడా ఇంట్లో చెపుతాను అన్నాడు
ఇద్దరు సరేసరి ప్రేమ అంటే ఒక పవిత్ర ఆలోచన ఏదో ఇలా చూసి అలా ప్రేమించాను అని చెప్పేసి ప్రేమ లేఖలు రాసి ఖంగా రు పెట్టే పెళ్లి చేసుకుని అనవసరంగా నిన్ను ప్రేమించాను అనే ప్రభుద్దులు చాలా మంది ఉన్నారు.
పెళ్లి అయ్యేవరకు ప్రేమ పెళ్లి తరువాత నువ్వు మా పెద్దమ్మ కూతురికి నచ్చలేదు
అన్నయ్య వదిన గర్వంగా ఉంది
అని ఒకళ్ళు ఏరా అక్కల పెళ్లి చేశావు లక్షలు ఖర్చు అయ్యియి నువ్వు కట్నం తీసుకోలేదు అని ఇంకొందరు.
పెళ్లి తరువాత పిల్లను వంకలు పెట్టే వాళ్ళు ఎక్కువ పెళ్లికి ముందు నాకు ఎవరూ లేరు. ఎవరి అవసరం లేదు నాకు నువ్వు నీకు నేను అంటూ వేదాలు సూక్తులు వర్ణించి వివరించి జీవితం విలువ చెప్పే ప్రేమికులు ఎందరో అలాంటి ప్రేమ వద్దు అవి గొప్ప కబుర్లు అన్నది సౌమ్య ఆలోచన
మా కౌ జీన్ నీగురించి చెప్పాను. పెళ్లి చూపులకి వపౌకున్నా డు
నీ పేరులో సౌమ్య ఉన్నది నువ్వు కూడా బాగా సౌమ్యంగా ఉంటవని వాడి భావన. ఇప్పటి కి ఎన్నో సంభందాలు చూశారు ఏ ఒక్కరూ నచ్చలేదు. ముందు అక్కల పెళ్లి అని తప్పించుకున్నాడు ఇప్పుడు విన్నాడు. ఈ ఆదివారం వస్తాడు వాడు బ్యాంక్ పి ఓ అందుకని సెలవలు కుదరవు. పోనీ పెళ్ళికైన కుదురుతుందని సౌమ్య వెక్కిరింతగా అన్నది.
అది నీ ఒపీనియన్ పై ఆధార్ పడి ఉన్నది పెళ్లి సింపుల్ అని సౌమ్య నవ్వింది
ప్రేమ ఒక అపురూపం తో నిండిన భావన
ప్రేమ ఒక అమృత తుల్యము. ప్రేమ ఒక అద్భుత సౌధము అందులో జీవిచడం ఒక అదృష్టము. సౌమ్య మాటలకి కొలీగ్ అబ్బుర పడింది
ఆదివారం వచ్చింది సౌమ్య తల్లి తండ్రి పెద్దవాళ్ళు అయి ఉన్నారు కూతురు ఇప్పటికైనా పెళ్లి చూపులకి వప్పుకున్నది అంతే చాలు అనుకున్నారు. ఆదివారం అన్ని ఏర్పాట్లు సౌమ్య చూసుకున్న దివాళ్లు
వచ్చారు. అక్క బావ అతను వచ్చారు. ఏనాడో తను ప్రేమించిన వ్యక్తి ఈనాటికి వప్పుకున్నది. ఆనాడు ఆమెను అతను చూసాడు కానీ సౌమ్య చూడలేదు. అందుకని గతం గుర్తుకు చెయ్యడం ఇష్టమే లేదు.
చూపులు అయియి కట్నం వద్దు పిల్ల చాలు నాకు వృద్ధులైన తల్లి తండ్రి ఉన్నారు వాళ్ళను నేను చూసుకుంటాను. మిమ్మల్ని మీ అమ్మాయి చూస్తూ ఉంటుది అని చెప్పడంతో అంతా సంతోషపడ్డారు.
పిడి కిట తలంబ్రాలు పెళ్ళికూతురు అంటూ శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన సెల్ ఫోనే రింగ్ టోన్ లో నుంచి మ్రోగింది
అసలు విషయం ఏమిటంటే సౌమ్యను రవి వర్మ ఎప్పటి కప్పుడు ఫాల్లో చేశాడు. ఎక్కడ ఉన్నా ఏమి చేసినా అమె గురించి తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాడు. ఒకటి రెండు సార్లు మధ్యవర్తిని కూడా పంపాడు అయిన పెళ్లి జరగలేదు ఇప్పటికి పదిహేను ఏళ్ల తపస్సు వాళ్ళ ప్రేమ ఫలించి పెళ్లి అయ్యింది. ఈ విషయం ఇప్పుడు కూడా సౌమ్య కు తెలియదు నిజమైన
ప్రేమ అంటే అదే ప్రేమ చిరకాలం జీవించు అని పెద్దలు అన్నట్లు ప్రేమ శాశ్వతం గా ప్రేమించిన వ్యక్తి కి తప్పక జీవిత ఆనందం దక్కుతుంది. అదే నిజమైన జీవిత ప్రేమ ధనము. శుభమ్

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!