గుణపాఠం

(అంశం:: “అర్థం అపార్థం”)

గుణపాఠం

రచన::జయకుమారి

ఫోన్ తీయ్యి రామ్. ఎన్ని సార్లు చేసాను,కనీసం ఎందుకు ఇన్ని సార్లు చేస్తుంది అని చెయ్యాలి,లిఫ్ట్ చెయ్యాలి కదా.!
అంటూ వంట గదిలో స్టవ్ కట్టేసి. బెడ్రూంలోకి వచ్చి పడుకుంది కానీ మనస్సు కుదురులేదు, ఏంటి మనస్సు అంతా గందరగోళం ,రామ్  ఏమైంది రా నీకు అనుకుంటూ ఏక్కడ ఉన్నావ్ రా తొందరగా రారా.! నిన్ను వెంటనే చూడాలి అనిపిస్తుంది.
నీకో గూడఁన్యూస్ చెప్పాలి.
పెళ్లి ఫొటోలు తీసి చూస్తూ రామ్.!
రామ్ నాది తప్పే ,నీ గురించి తెలిసి కూడా నిన్ను అర్ధం చేసుకోకుండా ఆ అమ్మాయి గురించి అడిగాను, గొడవ పడ్డాను, నీ మనస్సు బాధ పెట్టాను దయచేసి క్షమించు.
తను నీ ఫ్రెండ్ అని తెలుసు కానీ. నువ్వు నా సొంతం, నిన్ను ప్రాణం గా ప్రేమించాను. నువ్వు నా లైఫ్ లోకి వచ్చాక నువ్వే నా ప్రపంచం అయ్యావు. నాకు తెలుసు నువ్వు ఫ్రీడమ్ కోరుకుంటావ్,అలా అని ఎప్పుడు హద్దులు దాటవు అని కానీ నువ్వు అలా వేరే అమ్మాయి తో నవ్వుతూ మాట్లాడితే నాకు బాధ ,కోపం అనిపించి అడిగా,సారి రా! నాకు తెలుసు నువ్వు ఇప్పుడు డ్రింక్ చేస్తూ ఉంటావ్ అని. రామ్ ఫోటో చూస్తూ.! ఇడియట్ ఎంత మాయ చేసేవాడివి రా! కూడా కూడా తిరుగుతూ నన్ను నీ ప్రేమలో పడేసావు. నా కోసం నీకు ఇష్టం లేకపోయినా జర్మనీలో జాబ్ జాయిన్ అయ్యావు.
నా జ్ఞాపకాలను మది నింపుకొని రెండు సంవత్సరాలు నా కోసం ఎదురుచూశావ్,మధ్యలో మా అమ్మకు హార్ట్ ఆపరేషన్ కు డబ్బులు అవసరం అయితే పంపిచ్చావ్.
నా కోసం ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నావ్.
అలాంటి నువ్వు. నీ ముద్దుల పెళ్ళాం ఏదో కోపంలో ఒక మాట అంటే తిట్టాలి,కొట్టాలి, లేదా బ్రతిమలాడుకోవాలి, బుజ్జగించుకోవాలి అంతే కాని అలిగి వెళ్లిపోతావా.! పొద్దున్న అనగా వెళ్ళవ్. రా.రా చెబుతా నీ పని.
వచ్చి వెనుక నుంచి గట్టిగా హత్తుకొని ముద్దులు పెడుతూ ఏమిచేస్తున్నావ్ పిల్ల అంటావ్ కదా అప్పుడు చెబుతా.!
పోరా.పో నువ్వు నీ చిలిపి పనులు అని రామ్ చేసిన చిలిపి పనులు,తనతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ టైం ఎంత అయ్యిందో చూసుకొని, అయ్యో! రామ్ వచ్చే టైం అయ్యింది.అని అనుకుంటూ గబగబా లేచి టేబుల్ పై డిన్నర్ కి ఏర్పాటు చేసి స్నానం చేసి రామ్ కి ఇష్టమైన చీర కట్టుకొని. అందంగా రెడీ అయ్యి తలలో మల్లెపూలు పెట్టుకుంటూ.రా స్వామి నువ్వు ఏమి ముద్దు ముద్దుగా ఉన్నావే పిల్ల అంటూ నా అందాన్ని పొగుడుతుంటే. నీ పిల్లకి ఎంత బాగుంటుందో తెలుసా రామ్ నీకు అనుకుంటూ నా చిరునవ్వులన్ని సొగసైన చీర కట్టి నీ కోసం హొయలు పోతుంటే. ఆ చీర సింగారాన్ని నీ కొంటె చూపుతోనే పొగుడుతుంటే. నాలో సిగ్గు నీపై వలపు గా మారి నీ కౌగిలిలో ఒదిగిపోయే క్షణం కోసం ఎదురుచూస్తున్న .

ఇలా ఊహల్లో తేలుతూ ఉండిపోయిన.
ఏవండి, ఏవండి అని కంగారు గా పిలవడం విని బయటకి వచ్చిన తనకు.
ఏవండి ఈ ఫోటో లో ఉన్న వ్యక్తి మీ ఇంట్లో నే ఉంటారు అంట కదా.!
ఇయనకి ఏక్సిడెంట్ జరిగి ప్రాణాపాయంలో ఉన్నారు త్వరగా రండి అని అనగానే ఆమె అక్కడికక్కడే కళ్ళు తిరిగిపడిపోతుంది.
రామ్ వాళ్ళ అన్నయ్య, తమ్ముడు అందరూ ఆ ప్రదేశానికి చేరుకొని రామ్ ని హాస్పటల్ కి తీసుకువెళ్తరు.
కానీ డాక్టర్ ఇతను బ్రతకడం కష్టం వేరే ఊరు తీసుకువెళ్లి పెద్ద హస్పటల్ లో చేర్పించండి అంటారు. అప్పటికే రామ్ కోమా లోకి వెళ్ళిపోతాడు. తల,కాళ్ళు,చేతులు బా డమేజ్ అవుతాయి పాపం అలా కోమా లోనే మూడు నెలలు ఉండిపోతాడు, ఇంట్లో వాళ్ళు లక్షలు లక్షలు పోసిన ఫలితం అంత అంత మాత్రం. డబ్బు మాట అటు ఉంచి తనకి చేసే సేవ మాటల్లో చెప్పలేము.
అయ్యో రామ్ తో అతని భార్య చెప్పాలి అనుకున్న విషయం రామ్ తండ్రి కాబోతున్నాడు అనే విషయం.
ఇప్పటికే రామ్ కి ఆ ప్రమాదం జరిగి పదిహేనునెలలు అయ్యింది. రామ్ కి పాప కూడా పుట్టింది.కోమా లోంచి బయటకి వచ్చాడు కానీ మాటలు రావడం లేదు. ఒక కాలు,చెయ్యి పని చేయడం లేదు.ఇదే ఆ రోజు ఆమె రామ్ ఏంటో తెలిసి కూడా అలా మాట జరకుండా ఉండి ఉంటే.రామ్ కూడా నా ప్రవర్తన వల్ల తను బాధ పడి అంది నేను కొంచెం సర్దుకుపోవాలిసింది అని అనుకోని.
అలా మందు త్రాగి వేగంగా బండి నడపకపోయివుంటే .
ఇలాంటి పరిస్థితి వచ్చేదా చెప్పండి,కొత్త గా ప్రేమించి పెళ్లి చేసుకుని కనీసం ఐదు నెలలు కూడా కలిసి లేరు.
అందుకే ఒకరినొకరు అర్ధం చేసుకొని మసులుకోవాలి.
అపార్దా లు వచ్చినప్పుడు స్థిమితంగా కూర్చుని మాట్లాడొకొని అపార్ధాలను దూరం చేసుకుని. మనస్ఫూర్తిగా వారిని దగ్గరకు తీసుకోవాలి.అంతే కాని క్షణికవేశాలకు పోతే జీవుతాలు ఇలా తారుమారు అవుతాయి. అని రామ్ జీవితమే చెబుతుంది.
చెడు వ్యాసనాలు జీవితాన్ని ఎలా చిన్న బిన్నం చేస్తాయో ఈ కథ చెబుతుంది.
దయచేసి చెడువ్యసనాలకు దూరంగా ఉండండి.
ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితాన్ని సంతోషంగా గడపండి.

You May Also Like

One thought on “గుణపాఠం

  1. Bagundhi jaya story… కొన్ని నేర్చుకోవడానికి కొన్ని కోల్పోవాల్సి వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!