అనుమానపు మొగుడు

(అంశం:: “అర్థం అపార్థం”)

అనుమానపు మొగుడు

రచన:: .సుజాత

నాకు ఉద్యోగం చేయాలనే కోరిక చాలా ఉంది.
ఆడపిల్లలు ఉద్యోగాలు ఏంటి అంటూ నాన్నగారు కోపం చేసేవారు దానికి నేను ససేమిరా ఒప్పుకునేదాన్ని కాదు ఈ రోజుల్లో కూడా ఆడపిల్లలు మగపిల్లలు అంటూ తేడాలు.ఏంటని వాదించేదాన్ని ఈ రోజులలో అందరూ జాబులు చేస్తున్నారు ఇంకా మీ చాదస్తం ఏంటి నాన్నగారు అంటూ గట్టిగా అడిగాను మరి ఏంటి ఆడపిల్లలు ఉద్యోగాలు చేసి ఊర్లు ఏలాలా అన్నాడు నాన్నగారు

నేను ఉద్యోగం చేస్తానని మొండిగా అంటూ నేను ఎవరీ మాట వినను నేను జాబ్ చేస్తాను అంతే కోపంతో అన్నాను మీ ఇష్టం ఏదో ఏడవండి అంటూ లోనికి వెళ్లారు.నాన్నగారు హమ్మయ్య ఈమాట అన్నారు చాలనుకున్నాను వెంటనే నా ఫ్రెండ్ అమిత్తో ఈ మాట చెప్పాను.సరే అప్లై చేద్దాం నేను కూడ చేస్తాను.మన ఇద్దరం కలిసే చేద్దాం అన్నాడు “అమిత్” హారికకు చాలా సంతోషం వేసింది.

అమిత్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ చాలా మంచివాడు. నిజాయితీగా ఉంటాడు.అందుకే అతడు అంటే నాకు చాలా అభిమానం ఏ విషయాన్నైనా అతనితోనే
చర్చిస్తాను మంచి సలహా ఇస్తాడు చిన్నప్పటి నుండి కలిసిమెలిసి తిరిగాము మా పక్కింట్లోనే ఉంటారు వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు ఒకే ఆఫీస్లో పని చేస్తారు రెండు ఫ్యామిలీలు బెస్ట్ ఫ్రెండ్స్.ఆ చొరవతోనే అన్ని విషయాలు షేర్ చేసుకుని మాట్లాడుకుంటాం.

ఇద్దరం ఆన్లైన్లో అప్లై చేశాము.అప్లై చేసిన వారానికే ఇద్దరికి ఇంటర్వ్యూకు పిలుపు వచ్చింది. అదృష్టవశాత్తూ మా ఇద్దరికీ ఉద్యోగం వచ్చింది నా ఆనందానికి అవధుల్లేవు చాలా సంతోషపడ్డాను.కాని ఇద్దరికీ వేర్వేరు ఊర్లో వచ్చింది. అలా మా ఇద్దరి మధ్యలో గ్యాప్ ఏర్పడింది మా నాన్నగారు సంబంధాలు చూడటం మొదలు పెట్టారు నాన్న నేను ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోను నాన్న అన్నాను. అయినా సంబంధాలు చూడడం మానలేదు నాకు చాలా బాధగా అనిపించింది.అమిత్ కు ఫోన్ చేసి చెప్పాలనిపించింది

కానీ ఫోన్ కలవడంలేదు.ఏమైనా వేరే ఫోన్ నెంబర్ ఉందోనని చూశాను కాని లేదు మారిందో ఏమో ఇప్పుడు ఏం చేయలేను మా నాన్న మాటకు సరె అన్నాను. ఒక సంబంధం వచ్చింది అతను ఇన్ఫోసిస్ కంపెనీలో పని చేస్తాడు .నాకిష్టం లేదు కాని తప్పలేదు పెళ్లికి ఒప్పుకున్నాను అప్పుడు అమిత్ చెల్లెలు మానస మాటలు గుర్తుకొచ్చాయి. ఎప్పుడూ మమ్మల్ని ఆటపట్టించేది.అక్కా అక్కా అంటూ నా చూట్టే తిరిగేది చాలా అల్లరి పిల్ల ఒక్కొక్కసారి అక్కా అంటూ ఇక్కొక్కసారి వదిన అంటూ నన్ను ఆట పట్టించేది దాని అల్లరికి నవ్వుకునేవాళ్ళం కాని సీరియస్గా తీసుకునే వాళ్లం “కాదు”అమిత్ మనసులో ఏముందో నాపై ఎలాంటి అభిప్రాయం ఉందో తెలియదు కదా అనుకుంది మనసులో

దానికి చదువు కాగానే పెళ్లి చేసి పంపించారు.ఎప్పుడు వచ్చినా నన్ను కలవంది పొయ్యేది కాదు ఇప్పుడు అది మద్రాసులో వుంది ఇక్కడ ప్రస్తుతం వాళ్ళ నాన్నగారు అమ్మగారు కూడా లేరు యాత్రలకు వెళ్లారు అమిత్ నెంబర్ ఎవర్ని అడగాలో అర్ధం కావడంలేదు ఏమోలే ఎలా జరగాలనుంటే అలాగే.జరుగుతుంది అంతెే రేపు పెళ్లి.చూపులకు వస్తున్నామని కబురు పంపారు.చాలా బాధగా ఉంది ఇప్పుడే చేసుకోవాలని లేదు అయినా తప్పేటట్లు లేదు నాన్నగారు ఊరుకోరు సరే అన్నాను.

అన్నట్టుగానే అన్న టైముకు తల్లి తండ్రి అబ్బాయ్ వచ్చారు పెళ్లి చూపులకు వచ్చి చూసి మళ్లి రేపు కబురు పంపుతామని వెళ్ళారు.అప్పుడే మాకు ఇష్టమని కబురు పంపారు మా నాన్నగారికి నన్ను ఇష్టపడ్డారని తెలిసి మా నాన్నగారు చాల సంతోషపడ్డారు పెళ్లి నాకు ఇష్టం ఉన్న.లేకున్న తప్పేట్టు లేదు. పెళ్లి జరిపించారు అతనికి జాబ్ .హైదరాబాదు లోనే నాకు జాబు అక్కడే ఇద్రరికి ఏ.ప్రాబ్లం లేదు అలా కొత్త ఇంట్లో కాపురం పెట్టాము కొన్ని రోజులు సర్దాగానే గడిచిపోయాయి.నేనంటే ప్రేమ చూపించేవారు కాదు ఎప్పుడూ కోపంతో ఉన్నట్టుగా ఉంటారు ఎక్కువగా మాట్లాడరు ఆయన స్వభావమే అంతే కావచ్చు అనుకున్నాను కానీ తన మనసులో ఏముందో బయటకు తెలిసేది కాదు ఎప్పుడు ముభావంగానే ఉంటాడు.కొద్దిగా కోపం ఎక్కువే

ఎందుకు అన్నది అర్థమయ్యేది కాదు ఉద్యోగం చేసే ఆడవాళ్ళంటే తనకి నచ్చేది కాదు ఒకలాంటి జెలసి ఉండేది తనకి నేను ఎక్కువగా పట్టించుకునేదాన్ని కాదు.ఆలోచించే టైమ్ కూడ ఉండేదికాదు నా పనులు నేను చేసుకుంటూ.పోయేదాన్ని కొన్నిరోజులకి నేను ప్రెగ్నెన్సీ అని తెలిసింది.నాకు చాలా సంతోషం వేసింది తనకి చెప్పగానే మొహంలో సంతోషం కనిపించలేదు ఎందుకో నాకు చాలా బాధగా అనిపించింది.

ఎప్పటి లాగే గబగబా పనులు చేసుకొని ఆఫీసుకు వెళ్తున్న కొద్దిగా లేటు వచ్చిన అనుమాన పడే వారు తనకు ఒంట్లో బాగా లేదంటే కూడా హెల్ప్ చేసేవారు కాదు అన్ని పనులు నేనే చేస్తుండటంతో చాల వీగ్గా
ఉన్నాను ఆఫీసుకు సెలవు పెట్టాలనుకున్నాను. అదే విషయం తనతో అన్నాను.నీ ఇష్టం అన్నారు.ఎదో ముభావంగా ఎందుకులే అని మళ్లి వెళ్లాలనే నిర్ణయించుకున్నాను.ఆ రోజు ఆఫీసు నుండి రావడం లేటు అయింది ఎమండి ఈరోజు ఆఫీసులో వర్కు చాల ఎక్కువగా ఉంది.లేటు అవుతుంది.ఆఫీసుకు మీరు వస్తారా బండి తిసుకుని అంటూ ఫోన్ చేసాను.నాకు వీలుపడదు. అని మొహంపైన్నే చెప్పేసారు.

.సరేలే అనుకుంటూ మెల్లిగా రోడ్డు దాకా నడవడం మొదలు పెట్టాను అనుకోకుండా అమిత్ కన్పించాడు హాయ్ హారిక ఏంటి ఇలా అంటూ పలకరించాడు. హాయ్ అమిత్ వాటే సర్ ప్రైజ్ అంటూ పలకరించాను ఇద్దరి మొహాలలో చెప్పలేనంత ఆనందం హాయ్ హారిక రోడ్డుపై ఎందుకు అలా రెస్టారెంట్లో టీ .తాగుతూ మాట్లాడుకుందాం పద అంటూ ఇద్దరు వెళ్లారు రెస్టారెంట్కి ఏంటి విశేషాలు చెప్పు హారిక అన్నాడు అమిత్ తనకు చెప్పలేని బాధ కళ్ళల్లో నుండి నీళ్ళు ధారలుగా కారుతున్నాయి.అంతా అయిపోయాక ఏం చెప్పమంటావు.అంటూ టీ తాగుతూ మనసులో అనుకుంది.బాధగా పైకి నవ్వుతూ

ఏంటి ఇన్నిరోజులు ఎక్కడున్నావ్ కనీసం ఫోనయినా చేయలేదు ఎందుకని అంది హారిక ఏం చెప్పమంటావ్ హారిక ఆఫీస్ వర్క్ మీద ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది అక్కడ పని ఒకటే బిజీ వీలు దొరకలేదు సారి హారిక మళ్లీ ఇన్నాళ్లకు మీ అందరినీ కలవడానికి ” వచ్చాను”. ఏదో నిర్లిప్తంగా నవ్వుతూ.అవున అంది.

ఏంటి హారిక విషయాలు చెప్పు మౌనంగా ఉన్నావేంటి నీ మొహంలో ఎప్పటిలా సంతోషం కనబడడం లేదు కారణం ఏంటి హారిక అన్నాడు అమిత్. కారణం అంటూ ఎమ్ లేదు నాకు పెళ్లి
అయ్యింది ఏంటి పెళ్లయిందా ఒక్కసారిగా షాక్ తిన్నాడు అవును అంది. ఏంటి కనీసం చెప్పనైనాలేదు అప్పుడు నేను గుర్తుకురాలేదా హారిక అన్నాడు బాధగా అమిత్ నీ ఫోన్ నెంబరు మారినట్టువుంది కదా నేనెలా నీకు ఫోన్ చేస్తాను అంది మీ పాత నెంబర్కు ఫోన్ చేశాను కలవలేదు నీవైనా చేయొచ్చు కదా అంది హారిక సరే అంతా అయిపోయింది గతం తవ్వుకుంటే లాభంలేదు అంది హారిక చాలా బాధగా ఉంది హారిక నీకు అన్ని విషయాలు వచ్చి క్లుప్తంగా చెప్పాలనుకున్న కాని లేటయిపోయింది సారీ అన్నాడు అమిత్ సరే పద అమిత్ నేను నిన్ను డ్రాప్ చేసి వెళ్తాను.అన్నాడు

ఏం ఫర్వాలేదు. అమిత్ నేను వెళ్తాను. ఎంటి హారిక నన్ను పరాయివాణ్ణి చేసిమాట్లాడుతున్నావు ఎందుకు అలాంటిదేమి లేదు సరే అంటూ హారిక కారెక్కి ఇంటిముందు దిగారు.బెల్ కొట్టగానే ప్రదీప్ తలుపు తీసాడు నన్ను చూడగానే అదోలా చూస్తూ ఫేస్ పక్కకు తిప్పుకున్నాడు చాల లేటు. అయిందండి మీరు రమ్మంటే. రాలేదు. కద దారిలో మా చిన్ననాటి ఫ్రెండ్ అమిత్ కలిశాడు ఇంటి దగ్గర దిగబెడతాను అంటే వచ్చానండి అంది.

అడుగక పోయిన. సమాదానం చెప్పింది ఓ హో నీకు బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా అంటూ అదోలా చూస్తు అన్నాడు అదేమీ పట్టించుకోకుండా అవును మీకు చెప్పలేదు కదూ అంటూ పరిచయం చేసింది హాయ్ అంటూ విష్ చేశాడు అమిత్ పొడిగా హాయ్ అన్నాడు ప్రదీప్ హాయ్ హారిక వస్తాను అంటూ వెళ్లాడు.అమిత్ వెళ్లగానే షికార్లు తిరగడం కోసం అబద్ధం చెప్పావా ఆఫీసు వర్కుఉందని .అదేంటి అలా మాట్లాడతారు నేను అబద్ధం ఎందుకు చెప్తాను నీకు తిరుగుళ్లు ఎప్పటినుండి అలవాటు అంటూ నిలదీశారు అంటే నన్ను అనుమానిస్తున్నారా అనుమానించక ఇంత లేటెందుకైంది.

ఎంత చేప్పిన వినకుండా ఇష్టం వచ్చినట్టుగా మనసు
బాధ పెట్టేలా మాట్లాడారు. ఆ రోజు తినకుండానే
ఆకలి కడుపుతో పడుకున్నాను. అంతా మరిచిపోయి
నట్టుగా ఎప్పటిలానే పెందలాడే లేచాను.కిచెన్లోకి వెళ్లగానే తను టీ పెడుతూ కనబడ్డాడు.అదేంటి మీ మీరెందుకు పెడుతున్నారు.నేను పెడతానుగా అవసరం లేదు అన్నాడు. ఎమండి రాత్రి జరిగిన చిన్న విషయానికే ఇంతలా కోపం పెట్టుకోవాల అంటూ ఎదొ చెప్పబోయింది. అంతలోనే ఇతను ఒక్కడేనా ఇంక అనబోయాడు …ఎమండి అంటూ గట్టిగా అరిచాను. చీ..చీ మీ మొగబుంది పోనిచ్చారు కాదు.అంటూ
ఎడ్చుకుంటు లోపలికి వెళ్లాను. అలా ఎంత .సేపు
ఎడ్చానో కళ్లు అంతలా వాచాయి.

పొద్దున్నే అమిత్ వచ్చాడు నేను అటువైపుగ వెళ్తున్నాను. నిన్ను దింపుతాను.పద హారిక అన్నాడు.
మొహం అంతా వాచిపోయి ఎర్రగా కందగండలా .
మారింది ఎందుకు అర్థం.. కాలేదు మొహం పక్కకు తింపుకుని మాట్లాడింది. నేను ఆఫీసుకు రావడం లేదు అమిత్ మీరు వెళ్ళండి అంది ఎందుకు ఊరికనే అంది ఎంటి హారిక అలా ఉన్నావు .ఒంట్లో గాని బాగలేద అంటూ నుదిటిపై చేయివేసి చూసాడు గబుక్కున పక్కకు .జరిగింది.

ఎదొ జరిగిందని అర్థం అయింది. సరే హారిక నేను
వస్తానని వెళ్లాడు. అమిత్ వెళ్లాక చాలా గొడవ జరిగింది. ప్రదిప్ నన్ను .అనుమానిస్తున్నావ. అని
అడిగింది. ఉద్యోగాలు అంటూ మొగుళ్లను మోసం
చేస్తు తిరుగుతారు నీ బాగోతం అంతా నాకు తెలుసు అన్నాడు. అదేంటి అందరితో నన్ను పోలుస్తారు.ఎందుకు అంటే నన్నే ఎదురిస్తావ. అంటూ నువ్వేమన్న పతివ్రతవ అంటూ జుట్టు పట్టుకుని రెండు ఇచ్చాడు అమ్మ అంటూ గింజుకుంది.ఎమండి
వదులండి. అని ఎంత మొత్తుకున్నా వదులడంలేదు.
తనకు కసిదీరా కొట్టాడు. ఆ కొట్లను భరించలేక.
సొమ్మసిల్లింది. మేల్లగ తండ్రికి ఫోన్ చేసి పిలిపించుకుంది.

తండ్రి హుటాహుటిన వచ్చాడు. హారిక పరిస్థితిని చూసి చాల.బాధపడ్డాడు అమ్మ .నీవు పెళ్లి .వద్దు నాన్న అన్నావికుండా ఈ నీచుడికి ఇచ్చి పెళ్లి చేసాను నేను ఎంత మూర్కున్ని తల్లి అంటూ.విలవిలాడిపోయాడు. పదమ్మ నిన్ను ఒక్కక్షణం కూడ ఇక్కడ ఉంచను తల్లి నీవు ఫోన్ చెసినప్పటి నుండి మీ అమ్మ ఒక్కటే కంగారు పడుతుంది. వీడి సంగతి తరువాత. చెపుతాను.పద తల్లి అనుమానం ఉండేవాడితో సంసారం చేసిన ఒక్కటే చేయకున్నా ఒక్కటే తల్లి పద అంటూ నీవు మాకు బరువేం కాదు తల్లి అంటూ తీసుకువెళ్లాడు తండ్రి నిస్సహాయురాలిగా తండ్రివెంట వెళ్లింది. అనుమానం పడే మొగుడితో సంసారం చేసినా చేయకున్నా ఒక్కటే నాకిలాంటి మొగుడు వద్దనుకొని నాకు జాబ్ ఉంది నా బాబును నేను పోషించుకుంటాను అంటూ కళ్లు తుడుచుకుంటూ ధైర్యంతో వెళ్లి పోయింది. హారిక అందరి ఆడవాళ్లకు ఆదర్శంగా ఉంటాను అనుకుంది మనసులో…

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!