మరో దివిసీమ

మరో దివిసీమ

రచన: కమల ముక్కు

అవిశ్రాంతంగా కురిసే వానల్తో
నదులూ వాగులూ పొంగి
వీధుల్లో పారుతున్నాయి/

ఇల్లూ బడులూ కార్యాలయాలూ
జల దిగ్బంధనం అయ్యాయి/

రోడ్లేవో మురికి గుంటలేవో తెలియక
నడక దారిన గుంటల్లో పడి
కనుమరుగయ్యే వారెందరో/

చెరువులూ నదులూ కంతలు పడి
బార్లా చాపిన నోర్లతో
ప్రజల మూగ జీవాల ప్రాణాలనూ
మింగేస్తున్నాయి/

భీభత్సం సృష్టిస్తోన్న వరదల తాకిడికి
అడ్డుకట్ట పడేది ఏనాడో/

పోతున్న ప్రాణాలను
రక్షించుకునే మార్గం దొరికేదేనాడో/

ఆకలేస్తున్నా తినడానికి తిండిలేదు
రోగమొస్తే వేసుకోవడానికి మందుల్లేవు
ముంచుకొస్తున్న వరద ఉప్పెన నుంచి
తప్పించుకునే మార్గం లేక

రక్షించే నాధుడెవరూ
కనుచూపు మేరలో కానరాక
బిక్కుబిక్కుమనే బ్రతుకులు చూస్తుంటే
మరో దివిసీమ ఉప్పెనే
చూసినట్టుగా ఉంది/

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!