బాణీల బాణాలు

అంశం: హాస్య కథ

బాణీల బాణాలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: చంద్రకళ. దీకొండ

హ…హ…హి…హి…హు…హు..
ఇదిగో బాణీ అంటూ విసిరాడు సంగీత దర్శకుడు
అడుగో-ఇడుగో-పడగో-గొడుగో
అంటూ పల్లవి పూర్తి చేసాడు కవి…!
లాలళా… లులులూ….లేలేలే…
లైలైలై
కలవా-ఇలవా-కననే-పడవా
“ఓహ్…అద్భుతం”అనుకుంటూ
పాట పూర్తి చేసాడు…!
ధిమికు-ధిమికి-ధుమికి-ధిం-
ధిం-ధిం
ఉరుకు-ఉరుకు-దుముకు-
పరుగో-పరుగు
“బెమ్మాoడం”తనకు తానే
కితాబిచ్చుకుంటూ కవి…!
ఈ సారి కాస్త కఠినమైన బాణీ
పతటచక-బదడజగ-విలంబి-
విప్రలబ్ద-దుందుభి
ఆలోచించి… ఆలోచించి…
స్వరాలు చీల్చి… చెండాడి
పల్లవి ఇచ్చాడు కవి…!
అర్థం కాని శ్రోతలడిగితే…
రాక్షసుడు సినిమాలో ఇలాగే
గాయకుల పేర్లను”బా…జా…సు…”
అంటూ పాటలో పెడితే
అందరూ ఆనందంగా పాడుకున్నారుగా…
ఇది మాత్రం ఎందుకు పాడుకోరు…?!
అన్నాడు కవి ధీమాగా…!
బాణీల బాణాలు గుచ్చుకుని విలవిలలాడసాగారు విన్నవాళ్ళు…!!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!