నాకొద్దు ఈ పెళ్ళి

అంశం: హస్యకథలు

నాకొద్దు ఈ పెళ్ళి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు

చంద్రంకి వయసు పెరిగిపోతోంది. పెళ్ళికి ఒక్క సంబంధము కుదరలేదు. చంద్రం ఏమి అవికారికాదు. చూడడానికి బాగానే వుంటాడు. చదువుకూడా వుంది. డబ్బుకూడా వుంది. మరి అతనికి ఎందుకు పెళ్ళి కావటంలేదోనని వాళ్ళ ఇంట్లో వాళ్నకంటే బయటవాళ్ళకే ఎక్కువ ఆలోచన. చాలామంది దగ్గరబంధువులు తమ ఆడపిల్లలను ఇస్తామని ముందుకు వచ్చారు గాని వాళ్ళెవరికి చంద్రం నచ్చలేదు. స్నేహితులుకూడా చాలా ప్రయత్నాలుచేసారు. కాని అవి కలసిరాలేదు.ఇంతకీ అదోకచిక్కుప్రశ్నలా మారిపోయింది. ప్రేమించి పెళ్ళి చేసుకుందామంటే మరి ఆ అవకాశం కూడా దాటిపోయింది. ఎందుకంటే చదువుకునే సమయంలో చంద్రం రాముడు మంచి బాలుడుగా ఉండేవాడు. అందుచేత ఏ అమ్మాయి దగ్గరకురాలేదు. జాతకాలు చూపెట్టారు. అందులో ఏమి లోపం లేదు. మరింకేమిటి లోపం? అతను మాట్లాడితే నోటి దుర్వాసనే కారణం అని అతనిని పరీక్షించిన దంతవైద్యుడు తేల్చేశాడు. ఎన్ని క్లోజపు పేష్టులు వాడినా ఏ అమ్మాయి ఇష్టపడటంలేదు. నాకి పెళ్ళి వద్దంటూ తప్పుకుంటున్నారు. అందుకే చంద్రం పెళ్ళికాని ప్రసాదుగానే ఉండిపోయాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!