అంశం: జ్ఞాపకాల నిశ్శబ్దంలో
ఆత్మీయ రూపం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: లోడె రాములు
ఊహ తెలిసినప్పటి నుండి ఊపిరిగా మెదిలిన స్వప్నం
ఎదుగుతున్న కొద్దీ ఎదపైనే
ఆడించిన ఆత్మీయ రూపం
ఆశల రెక్కలు తోడిగి అక్షరాల తోటలోకి తోలిన దశరధుని కర్తవ్యం
కొడుకు ప్రయోజకుడవుతుంటే…
ఊరంతా పొగుడుతుంటే
లోలోనే సంతసించిన తండ్రి మనసు
నాన్నా!!నా జ్ఞాపకాల నిశ్శబ్దంలో మీరెప్పుడూ చిరంజీవివే…
మీరు నెరవేర్చింది కొండంత కర్తవ్యం
నేను కొసరంత భాద్యతైనా తీర్చుకోలేక పోయా..
అయినా.. విసుక్కున్నది లేదు..
జీవిత చరమాంకం వరకు నన్ను చిన్నపిల్లాడిగానే చూసుకున్నావు
మీ రుణమెలా తీర్చుకోను..
తండ్రీ..!సదా మీ పాదాల వద్దే నా ప్రాణం…