ఙ్ఞాపకాల తోడు

అంశం: జ్ఞాపకాల నిశ్శబ్దంలో

ఙ్ఞాపకాల తోడు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన:సత్య కామఋషి

కాలమలా సాగిపోతోంది
పోటెత్తిన గోదారి అలలా.!

జీవితం అలా ఆగిపోయింది
చుక్కాని లేని నడియేటి నావలా.!

ఏ దారి ఏ తీరానికోనని.,
తెలియని అయోమయంలో.,

నిశీధి చీకట్ల చెరను దాటలేక..
కలలు కరిగి తరిగిపోతున్నాయి.!

అడుగుకొక్క సుడిగుండంగా.,
ప్రతి ఘడియకొక్క గండంగా.,

ఎవ్వరు తోడురాని పయనంలో,
ఒంటరి బాటసారి గమనంలో.,

గతం తాలూకు స్మృతులన్నీ.,
నిశ్శబ్దపు ఙ్ఞాపకాల తెరలుగా.,
సుతారంగా మది తడుముతూ.,

గుసగుసగా పలకరిస్తున్నాయి..
ఏకాంతపు అలజడిని దీర్చే..
నిబ్బరాల సొంపైన సడులుగా.!

అలా అగిపోక సాగుతుండమని
కరిగిపోతూన్న కలలు ఒడిసిపట్టి
కలవలపెట్టే బ్రతుకు అలల జడిని
ఎదురీది సాగితే గెలుపు నాదనీ.!

ఎన్నో అనుభవాల పాఠాలను
చెప్పక చెబుతూ,చెలిమి పంచుతూ.!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!