ప్రతిఘటన (చిత్ర సమీక్ష)
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
సమీక్షకులు: బాలపద్మం
చిత్రం: ప్రతిఘటన
దర్శకులు: టి. కృష్ణ
అప్పటి రాజకీయ దౌర్జన్యాలపై పోరాటం సాగించిన వీర వనిత ఝాన్సీ (విజయశాంతి) పై రూపొందించిన కల్పనా చిత్రం ఇది.
న్యాయవాది (చంద్రమోహన్) గోపాల కృష్ణ భార్య గా ఝాన్సీ చూపిన నటన అనన్య సామాన్యం. ఒక రాజకీయ రౌడీ, కాళీ (చరణ్ రాజ్) దౌర్జన్యానికి అమానుషంగా నడి విధిలో అవమానించ బడిన ఝాన్సీ సమాజం నుంచి, భర్త అత్తవారి నుంచీ ఏ విధమైన ఓదార్పు లేకపోయినా, ధైర్యంగా నిలిచి ఒంటరిగా పోరాడింది. ఆ కాళీకి సహచరుడు యాదగిరి (కోట శ్రీనివాసరావు). వీళ్ళ దౌర్జన్యాలకు ఎదురు లేకుండా పోతుంది. చివరకి రక్షక భట, న్యాయ వ్యవస్థలు కూడా అచేతనంగా నిలుస్తాయి.
ఒక అధ్యాపక వృత్తి లో ఉండి దారి తప్పి నడుస్తున్న యువత ని దారికి తెచ్చి వారి తోడ్పాటు తో ఆ కాళీ ని ఎదురించి నిలవడం. మధ్యలో కాళీ తో కలిసినట్టు నటించి చివరికి అతనిని అంత మొందించడం తో కథ ముగియడం. సమాజం, తోటి వారు, భర్త అందరూ తనకు జేజేలు పలకడం జరుగుతుంది.
ఈ సినిమా ఇతి వృత్తం, డైలాగులు అన్నీ ఆధ్యంతం అద్భుతం. ఆ సమయంలో అసలు ఇలాంటి సినిమా ను తెరకెక్కించడం దర్శక నిర్మాతల సాహసమే.
మరో వైపు శ్రీ వేటూరి వ్రాసిన … ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో… అంటూ సాగే ఈ పాట ఒక ప్రత్యేకం. సమాజాన్ని కడిగి పారేసిన ఆణిముత్యం లాంటి పాట. శిశువులు గా మీరు పుట్టి పశువులు గా మారినా అని, తన రక్తాన్ని పాలుగా మార్చి పెంచితే దుర్మార్గులు గా తయారైన బిడ్డల గురించి తల్లి ఆవేదన మొత్తాన్ని ఒక్క పాట తో చెప్పడమే కాక ఆ పెడదోవ పట్టిన యువత ని దారికి తేవడం అద్భుతం. ఈ పాట ఇప్పటికీ ఎంతో తలమానికం.
Nice one
Chala baga varninchavu
మంచి సమీక్ష, మంచి నేపథ్యం ఉన్న సినిమా