వసంత రాగము

వసంత రాగము

రచన :: నారు మంచి వాణి ప్రభా కరి

వసంత్ రాణి వచ్చింది
మన్మధ భాణల్ తెచ్చింది
ప్రకృతి మాత పులకించి
వసంత రాగం ఆలపించే

కోకిలమ్మ ల స్వాగతం లో
కొత్త పలుకులు వినిపించి
కొమ్మ కొమ్మన రెమ్మ రెమ్మ న
ఎన్నో మధుర పుష్ప ఫలాలు

మానవాళికి అందించేవి
ప్రకృతిలో వసంత కాలం
ఎన్నో మధురిమలు నింపి
భూమాతను పులకింపచేసి

ప్రకృతి పరవశించి ఆహ్లాదంగా
పుష్ప మాలికా గీతిక స్వరాలు
ఆలపించివసంత రాగము పలికే కోకిలమ్మ ల గళం లో

ఇంపుగా సొంపుగా.నవరస
భరిత స్వరాలతో స్వాగతము
పచ్చని మొక్కల రంగు రంగు పూలతో ఈ వసంత రాణి కి
ఎన్నో అందాలు సంతరించి

మన ఇంటికి వచ్చిన రాణికి
హారతి పట్టి స్వాగత గీతాలు
ఆలపించి దీవెనలు పొంది
అనందం హాయిగా పొందాలి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!