దివా నక్షత్రాలు

దివా నక్షత్రాలు

రచన: చంద్రకళ. దీకొండ

జాతి విముక్తికై పోరాడిన
స్వాతంత్ర్య సమరయోధులు…
స్వసుఖాన్ని త్యాగం చేసి దేశం
కోసం పోరాడే వీరజవానులు…;
తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి
రోగులకు సేవ చేసే వైద్యసిబ్బంది…
అహర్నిశలూ శ్రమించి పరిశోధించి
మానవాళి సౌకర్యానికై నూతన పరికరాలను,
ఔషధాలను కనిపెట్టే శాస్త్రవేత్తలు…;
మానవత్వానికి ప్రతీకలుగా
ఆర్తులకు చేయూతనందించే పరోపకారులు…
పరులకై రక్తదానం,
అవయవదానాలు చేసే దాతలు…;
వ్యక్తిగత సౌఖ్యం మరచి…
విపత్కర పరిస్థితుల్లో సైతం…
ఆపదలో నున్నవారిని
ఆదుకొనే రక్షకభటులు…
కాలుష్యపు కూడలిలో…
ఎండావానల్లాంటి ఇబ్బందుల్ని
లెక్కచేయక నిలబడి…
వృత్తిధర్మాన్ని నిర్వర్తించే
వాహన రాకపోకల నియంత్రణా సిబ్బంది…;
ఇంకా ఎందరో మహానుభావులు…
అజ్ఞాతంగా సేవలందిస్తూ…
ప్రజాసౌఖ్యానికై పాటుపడుతూ…
దివానక్షత్రాల్లా వెలుగులీనే…
కిరీటరహిత శోభితాలు…
అందరికీ వందనాలు…!!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!