ఇనుప కవి
రచన: ప్రసాదరావు రామాయణం
రోబోలు వ్రాస్తున్నాయి కవితలు!
ఇనుపచేతులతో ఇంకు ఇంకని.కలంతో
పుంఖానుపుంఖాలుగా
ఏమీ అనుభవించనీ
ఏ అనుభూతీ పొందని
ఐరన్ గుండెతో ఐరానికల్ గా
ఆత్మీయత తెలియదూ
అనురాగం తెలియదు
ప్రేమంటే తెలియదూ
దొమంటే తెలియదూ
ఐనా వ్రాస్తున్నాయ్
ఇనుప గుండెతో
హృదయమంటే ఏమిటో
మస్తిష్కమంటే ఏమిటో
స్త్రీ అంటే ఏమిటో
పురుషుడంటే ఏమిటో
తెలియనితనాన్ని తెలిసినట్టుగా వ్రాస్తుంది
నీతిలేదు పాప భీతిలేదు
మనిషి చీకటికోణం చూడలేదు
ఐనా వ్రాస్తుంది నీతి కథలు
కవితా!కాచుకో నీకు నీవే!
