మనో గీతిక

మనో గీతిక

రచన: విస్సాప్రగడ పద్మావతి

ఎదలోతుల్లో  గుండు సూదుల్లా గుచ్చుకున్న
జ్ఞాపకాల దొంతరలు
కళ్ళలోగిళ్ళలో ఊపిరాడని
అలలు పోరాటాలను దూరం చేస్తూ
సందె దివ్వె చేరువైంది
నిశీదములో వికసించిన వెలుగుల చిరుమందహాసాల సుమాలు గృహాలను అలంకరించాయి
చుక్కలన్నీ ఆకాశాన్ని పరిచినట్లు
నేలంతా దీప కాంతులతో రంగులీను తోంది
మనసు ఆనందంతో ఉప్పొంగుతోంది
దీప కాంతి లక్ష్మీదేవి రూపమై
సదనం నందనవనం గా మార్చి
కోరిన వరాలిచ్చి
దీవించింది
ప్రతి ఇంటా సుమనోహర దీప శిఖలు విరబూసాయి
కవులంతా దీప శిఖలు
చేతబట్టి బాణ సంచాకు ఆరంభ గీతం ఆలపించారు
పిల్లల హస్తాలు దివిటీలతో మెరిసాయి
తీపి పదార్థాలతో మనసు మధువు లోలికి పులకరించింది

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!